Will change names in bjp regime

Bjp, power, Metro, Name, change name, Nagam Janardhan Reddy, Niz, nizam

If BJP comes to power, Will change name of metro

మెట్రో రైలు పేరును మారుస్తాం

Posted: 09/20/2014 09:48 AM IST
Will change names in bjp regime

మెట్రో రైలుకు నిజాం పేరు కలిసే విధంగా 'నిజ్' అని పేరు పెట్టాలని తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశీలించడాన్ని బీజేపి జాతీయ కార్యవర్గసభ్యుడు నాగం జనార్థన్ రెడ్డి తప్పు బట్టారు. అసలు నిజాంకు, మెట్రో రైలుకు సంబంధం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి పేర్లను తొలగిస్తామని వ్యాఖ్యానించారు. నిత్యం నిజాం జపం చేసే వాళ్లకు కూడా ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాం పాలనలో సాగిన ఆరాచకాలు చాలవన్నట్లు ఆయన పేరును ప్రభుత్వం పరిశీలించడం సహేతుకం కాదన్నారు.

జూరాల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లు నీట మునిగినా..  మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా సోయి లేదా అని దుయ్యబట్టారు. నాలుగు మాసాలు కావస్తున్నా.. ప్రభుత్వం ప్రజలు చేసిన మేలు ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తిందన్నారు. మెట్రోపై అపోహలు తొలగించాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bjp  power  Metro  change name  Nagam JanardhanReddy  Niz  nizam  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more