Petition filed in court against shah rukh khan mannat house

shah rukh khan, shahrukh khan latest news, shahrukh khan mannat house, shah rukh khan petition, mannat house, shahrukh khan movies, mumbai court

petition filed in court against shah rukh khan mannat house

మరోసారి కోర్టులో బుక్కైన బాద్షా షారుఖ్!

Posted: 09/13/2014 09:31 AM IST
Petition filed in court against shah rukh khan mannat house

బాలీవుడ్ బాద్షా తన మన్నత్ ఇంటిని అక్రమంగా నిర్మించాడంటూ ఇప్పటికే ఆయనపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం అందరికీ తెలిసిందే! తాజాగా ఇప్పుడు ఆ విషయంపై షారుఖ్ మీద బాంద్రా కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. సామాజిక కార్యకర్త అయిన నికోలస్ అల్మీదా ఈమేరకు కోర్టులో షారుఖ్ కు వ్యతిరేకంగా కేసు వేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా షారుఖ్ తన ఇంటిని నిర్మించుకున్నాడని.. ఈ కట్టడాన్ని వెంటనే తొలగించాల్సిందిగా అనేకసార్లు అధికారులను విన్నవించినా.. వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని అల్మీదా వాపోయారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడం కారణంతోనే ఈసారి ఆయన నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ముంబైలోని మైంట్ మేరీ చర్చ్ కు దగ్గరలోనే షారుఖ్ ఖాన్ తన ఇల్లు ‘‘మన్నత్’’ను నిర్మించుకున్నాడు. అయితే తన ఇంటిపక్కనుంచే ఆ చర్చ్ కు వెళ్లడానికి ఒక అడ్డదారి వుండేది. దాని ద్వారా ప్రజలు ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి వీలుగా వుండేది. ఇక ఆదివారం రోజు అయితే చర్చీకి వెళ్లాల్సిన వాళ్లు ఆ దారి ద్వారానే వెళ్లేవారు. అయితే షారుఖ్ మాత్రం ఆ దారిని మూయించేసి తనకోసం అక్కడ ఒక ర్యాంప్ ను నిర్మించుకున్నారు. దీంతో రాకపోకలకు అవస్థలు పడుతున్న ప్రజలు ఈ విషయమై అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నారు. ఈ వివాదం ఇప్పటినుంచే కాదు.. గత రెండేళ్లనుంచి జరుగుతూనే వుంది. అయినా ఏ అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో జనాలు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

షారుఖ్ మీద దాఖలైన పిటిషన్ వచ్చే నెల (అక్టోబర్) విచారణకు రానుంది. ఈ కేసులో షారుఖ్ తోపాటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మరో ముగ్గురు అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చినట్లు తెలుస్తోంది. మరి ఈ బాద్షా ఈ వివాదం నుంచి ఎలా తప్పించుకుంటాడో వేచి చూడాల్సిందే! మరోవైపు దీపావళికి రానున్న ఇతని ‘‘హ్యాపీ న్యూ ఇయర్’’ మూవీ సందర్భంలో ఇటువంటి వివాదాల్లో చిక్కుపోవడంతో ఇది ఆ సినిమాపై ప్రభావం చూపే అవకాశం వుంది. కాబట్టి.. అంతలోనే షారుఖ్ ఈ కోర్టు ఇబ్బందుల నుంచి బయటపడితే మంచిదేనంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  mannat house  mumbai court  shahrukh khan house  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more