(Image source from: house owner chinna tippanna killed a 4 years old boy vinod for doing toilet in his compound)
మనదేశంలో మానవత్వం రానురాను మంటగలిసిపోతోందని చెప్పడానికి ఈ దారుణమైన ఉదంతాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాలుగేళ్ల చిన్నారి తన ఇంటిముందు మూత్రవిసర్జన చేశాడనే కోపంతో ఆ ఇంటియజమాని అతణ్ణి తిరిగిరాని లోకాలకు పంపించేశాడు. అభంశుభం తెలియని ఆ పిల్లాడు చేసిన తప్పును సర్దిచెప్పాల్సిందిపోయి.. బలంగా కొట్టడం వల్ల ఆ చిన్నారి మృత్యువాత పడ్డాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చంపిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ మృతిచెందిన చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. చిన్న తిప్పన్న, గంగాధర్ అనే ఇద్దరు వ్యక్తుల కుటుంబాలు పక్కపక్కనే వుంటున్నాయి. అయితే గతకొద్దికాలం నుంచి ఈ కుటుంబాల మధ్య ప్రతిచిన్న విషయంమీద ఏదో ఒక వివాదం రేగుతూనే వుంటుంది. దీంతో వీరిమధ్య కోపతాపాలు ఎక్కువయిపోయాయి. ఈ నేపథ్యంలో గంగాధర్ కుమారుడు వినోద్ అనే నాలుగేళ్ల చిన్నారి... చిన్న తిప్పన్న ఇంటి ఆవరణలో మూత్రవిసర్జన చేశాడు. ఈ విషయాన్ని గమనించి అతడు ఆగ్రహంతో వినోద్ చెంపమీద చాలాబలంగా కొట్టాడు. అంతే! ఆ చిన్నారి అక్కడికక్కడే పడిపోయాడు. దీంతో అతడికి ఏం జరిగిందోనన్న భయాందోళనలతో పిల్లాడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆ చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దాంతో తల్లిదండ్రులు వినోద్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. చిన్నపిల్లాడు తెలిసీతెలియని చేసిన పొరపాటుకు ఏకంగా ప్రాణాలనే తీయడం ఎంతవరకు న్యాయమో చెప్పాల్సిందేనంటూ మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హోతూరులో ఈ దారుణం జరిగింది.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more