Mamata benarjee doors opened to join with left parties

mamata benarjee, latest news, west bengal, trinamool congress, cpi(m), cpi, communist, politcs, bengal news, prime minister, narendra modi, fdi, nda, government, atal bihari vajpayee, bjp

mamata benarjee reday to ally with left parties to stop bjp : ready to join with left to stop bjp says mamata

కమ్యూనిస్టుల కోసం తలుపు తీసిన మమత

Posted: 08/30/2014 01:19 PM IST
Mamata benarjee doors opened to join with left parties

కమ్యూనిస్టులంటేనే కస్సుమనే బెంగాల్ దీదీ మమతా బెనర్జి ఇప్పుడు మెత్తబడ్డారు. ఎరుపు రంగుపై మక్కువ పెంచుకుంటున్నారు. కమలాన్ని అడ్డుకోవాలంటే కమ్యూనిస్టులతో కలవక తప్పదని తెలుసుకున్నారు. అందుకోసం తాను సిద్ధమని కూడా ప్రకటించారు. సీపీఎం కలిసి వస్తామంటే కలుపుకు పోయేందుకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పింది. బీజేపిని అడ్డుకునేందుకు సీపీఎంతో కలిసి పనిచేసేందుకు సిద్దమని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.


వాజ్ పాయ్ ను బీజేపి అవమానించింది

రాజకీయాల్లో ఎవరూ అంటరానివారు కాదని.., తృణముల్ కాంగ్రెస్ గతంలో అనేక పార్టీలతో పొత్తులు కుదుర్చుకుందన్న విషయం గుర్తు చేశారు. అదే విధంగా ఒక పార్టీకి చెక్ చెప్పేందుకు మరొకరితో చేతులు కలపక తప్పదన్నారు. బీహార్ లో లాలూ, నితీష్ దోస్తి ఇందుకు ఉదాహరణగా చెప్పారు. ఆల్ ఇట్ హ్యాపెన్స్  ఇన్ పాలిటిక్స్ అని నీతి భోధించారు. తాను గతంలో బీజేపితో కలిసి పనిచేశానని అయితే ఇప్పుడు వారి విధానాలు మారిపోవటంతో పొత్తు కుదుర్చుకోలేదన్నారు. గతంలో వాజ్ పాయ్ ఉన్నందున ఆయన కోసం బీజేపితో జతకట్టానన్నారు. అయితే మహోన్నత వ్యక్తిని కమలదళం అవమానించిందని విమర్శించారు. బెంగాల్ లో అడుగుపెట్టామనుకుంటున్న బీజేపీ ముందుగా ఐదు సీట్లు గెలిచి తమ సత్తా చాటుకోవాలని సవాల్ విసిరారు.

అయితే మమతా బెనర్జి ప్రకటనపై కమ్యూనిస్టు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపి బెంగాల్ లో అడుగుపెట్టడానికి బెనర్జినే కారణమన్నారు. ఏకు మేకు అయ్యే సరికి మమతకు భయం పుట్టుకొచ్చిందని విమర్శించారు. బీజేపితో స్నేహంగా మెలిగినందుకు ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఆ తర్వాత లౌకికవాద పోరాటంపై దృష్టపెడతామని స్పష్టం చేశారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamata benarjee  cpi(m)  bjp  west bengal  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more