Revanth reddy says kcr s survey has inner agenda of driving away andhra people

KCR Survey, Telangana Survey, Revanth on Telangana Survey

TDP senior leader Revanth reddy accuses that KCR's survey has inner agenda of driving away Andhra people.

ఆంధ్రా ఉద్యోగులు, విద్యార్థులను వెళ్లగొట్టేందుకే ఈ సర్వే -రేవంత్

Posted: 08/18/2014 09:49 AM IST
Revanth reddy says kcr s survey has inner agenda of driving away andhra people

సమగ్ర సర్వే వెనుక తెరాస ప్రభుత్వం కుట్ర ఉందని, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడానికే ఈ సర్వే అని, దీన్ని తెలంగాణ ప్రజలు గ్రహించకుండా ఉండేందుకు ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా రహస్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు.

సర్వేపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారికంగా ఒక మాట, అనధికారంగా మరో మాట చెబుతున్నారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో విమర్శించారు. అధికారులతో కేసీఆర్ సంభాషణను మీడియాకు వినిపించారు. "ఆంధ్రా ఉద్యోగులు, విద్యార్థులను వెళ్లగొట్టేందుకే ఈ సర్వే అని, డిస్కరేజ్ చేస్తే వారే ఇక్కడి నుంచి వెళ్లిపోతారని... నా పని సాఫ్ అయిపోతుందని... దీన్ని నేను మైకులు పెట్టి చెప్పలేనని.. మహబూబ్‌నగర్‌లో వలసలు లేవని, ఎవరికోసమో సర్వే అపలేమని... ఎస్సీ వర్గీకరణ అంశం వదిలేయాలని'' రహస్య సమావేశంలో అధికారులతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన వినిపించారు.

12 గంటల్లో 4 కోట్ల మంది సమాచారాన్ని ఎలా సేకరిస్తారని ఆయన ప్రశ్నించారు. సేకరణకు వచ్చిన ఎన్యుమరేటర్స్ సమాచారం కోసం బలవంతం చేస్తే కేసులు పెట్టాలని, మాదిగలంతా కెసిఆర్‌ను నిలదీయాలని రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. సమగ్ర సర్వేకు ఒక్క రోజు ముందు కెసిఆర్ తన కుటుంబ ఆస్తులను వెల్లడించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కెసిఆర్ తన కుటుంబ ఆస్తులు వెల్లడించరు గానీ ప్రజలు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయితే కెసిఆర్ జైలుకు వెళతారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Telugu Desam senior legislator A. Revanth Reddy on Sunday accused Chief Minister K. Chandrasekhar Rao of having a "secret agenda" behind conducting the household survey in Telangana to "drive away" certain people from the state.

Revanth Reddy alleged that at a few meetings held with officials to work out modalities for the survey, the Chief Minister had said that he would work hard to see that people from AP move out of Telangana.

"This means Mr Rao has a set agenda. He wants to create fear among certain sections of people. That is why we suspect there is a hidden agenda behind the household survey," Mr Reddy claimed.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Survey  KCR  Revanth Reddy  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more