(Image source from: Sharks biting the cable wires of google in the seas)
ప్రపంచంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం అయిన ‘‘గూగుల్’’కు సొరచేపలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బాహ్యప్రపంచంలో ఎంతోవేగంగా దూసుకుపోతున్న ఈ సంస్థను.. సముద్రంలో వున్న వేడిని ఈ చేపలు రుచి చూపిస్తున్నాయి. అదెలా అంటారా..? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే!
ప్రపంచంతో ఇంటర్నెట్ అనుసంధానం కోసం సముద్ర అడుగుభాగాన ‘‘గూగుల్’’ సంస్థవారు ప్రత్యేకంగా కేబుల్ వైర్లను అమర్చారు. అయితే ఈ ప్రమాదకర చేపలు మాత్రం వాటిని కొరికేస్తున్నాయని సమాచారం! దీంతో ఖంగుతిన్న ఆ సంస్థవారు సముద్రపు జీవుల నుంచి తన కేబుళ్లను రక్షించుకునేందుకు గూగుల్ ఒక కొత్త విధానాన్ని రూపొందించింది. ఆ చేపలు తిరిగి కేబుల్ వైర్లను కొరకుండా వుండేందుకు ఒక నూతన కవచాన్ని అమర్చుతోంది. ఈ కవడం కెవ్లార్ వంటిదేనని... చాలా కఠినమైనది గూగుల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కెవ్లార్ తోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారుచేస్తారన్న విషయం విదితమే!
షార్క్ లు కేబుల్ వైర్లను కొరుకుతున్నాయన్న విషయాన్ని 80వ దశకంలో వెలుగులోకి వచ్చింది. 1987లో అమెరికా నుంచి ఐరోపా, జపాన్ లతో సమాచార సంబంధాల కోసం ఏర్పాటు చేసిన కేబుల్ ఫైబరర్ ఆప్టిక్ కేబుళ్లను ఈ సొరచేపలు కొరికేయడంతో ప్రపంచవ్యాప్తంగా వున్న ఫోన్లు, కంప్యూటర్ లో మొరాయించాయని ఆ సంస్థ తెలిపింది.
అలాగే 1985లో కానదీ దీవి వద్ద సముద్రంలో ఏర్పాటు చేసిన కేబుళ్లను కూడా పరిశీలించగా.. వాటిలో కూడా సొరచేప దంతాలు చిక్కుకుపోయి వున్నట్లు ఆ సంస్థవారు తెలుపుతున్నారు. ఈ విషయాలను గ్రహించిన ఆ సంస్థవారు.. తిరిగి తమ కేబుల్ వైర్లను కేవ్లారర్ కవచంతో తయారుచేసి మళ్లీ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. ఫైబర్ కేబుళ్ల చుట్టూ ఏర్పడే విద్యుదయాస్కాంత క్షేత్రానికి ఆకర్షితమవుతున్నందువల్లే సొరచేపలు వైర్లను కొరుతున్నాయని ఒక సిద్ధాంతం ప్రకారం వారు పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more