The villagers beat and paraded naked woman for doing black magic

black magic, bihar crime news, naked woman paraded, child died black magic, bihar black magic news, villagers beat naked woman

the villagers beat and paraded naked woman for doing black magic in bihar : Accused of black magic, woman forced to eat human excreta, paraded naked

చేతబడి చేసిందని... నగ్నంగా ఊరేగించారు!

Posted: 08/13/2014 04:26 PM IST
The villagers beat and paraded naked woman for doing black magic

ఒకవైపు మన భారతదేశం సాంకేతికపరంగా ముందుకు దూసుకుపోతుంటే.. మరోవైపు చిన్నచిన్న గ్రామాల్లో మూఢనమ్మకాల పర్వం పెచ్చుమీరిపోతోంది. ఎవరో ఏదో చేయిస్తే, ఎక్కడో వున్నవారు మరణిస్తారని... పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తుంటారని... దీనినే చేతబడి అంటూ అభివర్ణిస్తుంటారు. ఇది ఇప్పటినుంచి కాదు... ప్రాచీనకాలం నుంచి గ్రామాల్లో వస్తున్న ఆచారం! వారికి సాంకేతికంగపరంగా జ్ఞానాన్ని అందించే నాధులు లేకపోవడం వల్ల ఇటువంటి మూఢనమ్మకాలకు బలైపోతున్నారు. తాజాగా ఈ మూఢనమ్మకం వల్లే ఓ మహిళ తీవ్ర అవమానానికి గురవ్వాల్సి వచ్చింది.

బీహార్ లోకి కతిహార్ జిల్లా సక్రైలి గ్రామంలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఓ దారుణమైన సంఘటన చేసుకుంది. ఆ గ్రామంలో ఓ బాలుడు తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే ఆ గ్రామంలోనే వున్న కినియా దేవి అనే మధ్యవయస్సురాలు చేతబడి చేయించడం వల్లే ఆ బాలుడు మరణించాడనే అనుమానిస్తూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తారు. దీంతో ఆ బాలుడి బంధువులు ఆమెను చావబాదారు. అంతటితో ఆగకుండా ఆమెతో అశుద్ధం తినిపించి, ఆ గ్రామమంతా నగ్నంగా ఊరేగించారు. ఇంత అన్యాయం జరుగుతున్నా.. గ్రామస్థులు మాత్రం అడ్డుకోకుండా చూస్తుండిపోవడం విశేషం.

ఇంతలో ఈ ఘోరమైన ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని... ఈ ఘాతుకానికి పాల్పడిన ఆరుగురిమీద కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురి పరారీలో వుండగా.. ఒకరిని అరెస్ట్ చేశారు. కేవలం ఈ ఒక్క ఘటనే కాదు... బీహార్ లోని మారుమూల ప్రాంతాల్లో చేతబడి చేయిస్తున్నారని ఆరోపణలు చేసి ఎంతోమంది మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దీనిని అదుపుచేయడానికి ప్రయత్నించినవారు బలైపోతున్నారే తప్ప... దారుణాలు మాత్రం ఆగడం లేదు. దీనిపై బీహార్ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తక్షణమే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar state crime news  naked woman paraded  bihar villagers  black magic  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more