Mayawathi refuses to join with mulayam to fight on bjp

mulayam singh yadav, samajwadi party, akhilesh yadav, dimple yadav, mayawati, bahujan samaj party, bsp mps mla's, sp mps mlas, lalu prasad yadav, rastreey janata dal, rabri devi, lalu case, lalu arrest, nitish kumar, sharad yadav, janata dal united, jdu, uttar pradesh, bihar, bjp, modi, latest news, political news

mayawati refuses to join hand with mulayas singh : mulayam is hand in glove with communal forces we will not join with him says mayawati

అనుకుందొకటి.., అయ్యిందొకటి

Posted: 08/13/2014 03:40 PM IST
Mayawathi refuses to join with mulayam to fight on bjp

ఎస్పీ అదినేత ములాయం సింగ్ కు మాయావతి ఝలక్ ఇచ్చింది. బీజేపీని ఎదుర్కునేందుకు తనతో మాయ కలిసివస్తుందనుకున్న ములాయం ఆశలు ఆవిరయ్యాయి. ఎస్పితో చేతులు కలిపే ప్రసక్తే లేదని బహెన్ స్పష్టం చేసింది. మాయతో దోస్తి కోరుకుంటున్నట్లు ములాయం మనసులో మాట బయట పెట్టిన కొద్ది సేపట్లోనే మాయావతి ప్రెస్ మీట్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీతో కలవమన్నారు. ఈ సమావేశంలో ములాయం సింగ్ ను అతని పార్టీని, ప్రభుత్వాన్ని వరుసపెట్టి కడిగిపారేశారు. సమాజ్ వాదీ పార్టీతో కలిసి పనిచేయటం అనే ఆలోచన లేదన్నారు. మతతత్వ శక్తులతో కలిసి కుట్రలు చేసే వ్యక్తులతో తాము ఎప్పుడూ వ్యతిరేకమని ప్రకటించారు.

ములాయం సింగ్ అధికారం కోసం ఎప్పుడూ పరితపిస్తుంటాడనీ.., పవర్ కోసం ఏది చేయటానికైనా వెనకడుగు వేయడని విమర్శించారు. మతం రంగు పులుముకున్న అతని చేతులను తాకనని తేల్చి చెప్పారు. అధికారమే పరమావధిగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడే వ్యక్తి ములాయం అని మాయావతి ద్వజమెత్తారు. సమాజ్ వాదీ మాత్రమే కాదు యూపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ప్రకటించారు. ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కుంటామన్నారు. బీఎస్పీకి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎస్పీని ప్రజలు ఇంటికి పంపటం ఖాయంగా జోస్యం చెప్పారు. దుష్ట పాలకులను రానున్న ఎన్నికల్లో కిందకు దించుతారని ధీమా వ్యక్తం చేశారు.

లాలూపై మండిపడ్డ మాయ !!

చివరగా ఎస్పీ-బీఎస్పీ కలవాలని ముందుగా ప్రతిపాదించిన లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా మాయావతి వదిలిపెట్టలేదు. యాదవ సోదరులిద్దరికి అధికార దాహం పట్టుకుందని లాలూ, ములాయంను ఉద్దేశించి చురకలంటించారు. ఇందుకోసం వారు కుట్రలకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. పొత్తులపై మాట్లాడే ముందు 1995నాటి ఘటనను గుర్తుకు చేసుకోవాలన్నారు. 1995లో ఓ గెస్ట్ హౌజ్ లో మాయావతిపై ఎస్పీ ఎమ్మెల్యేలు దాడి చేయటంతో పాటు అవమానకరంగా ప్రవర్తించారు. ఇలాంటి వారితో కలిసి పనిచేస్తామని లాలు ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. గుండాయిజంకు పాల్పడుతున్న సమాజ్ వాదీ పార్టీని ప్రజలు ఘోరంగా ఓడిస్తారని మాయావతి స్పష్టం చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mulayam  mayawati  lalu prasad yadav  nitish kumar  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more