ఆడవారికి భూదేవికి ఉన్న సహనం ఉంటుందంటారు. మరి ఆ సహనం నశిస్తే..., ఉగ్ర కాళిక రూపం తప్పదని అందరికి తెలుసు. కార్యేశు దాసి, కరణేశు మంత్రి, బోజ్యేషు మాత, శయనేశు రంభ మాత్రమే కాదు.., ఇప్పుడు ధైర్యేశు వనిత అనక తప్పదు. అంటే ధైర్యంలో ఆడవారిలా ఉండాలని అవును ఇప్పుడు మహిళలు చాలా దైర్యవంతులు అవుతున్నారు. ఒకప్పుడు ఎవరు ఏ మాట అన్నా తమలో తాము బాదపడే వారు తప్ప.. ఎదురు సమాధానం చెప్పేవారు కాదు. కానీ కాలంతో పాటు వారూ మారారు. తమపై రోజురోజుకూ పెరుగుతున్న దాడులను ఎదుర్కోవటం మొదలుపెట్టారు. దెబ్బకు దేవుడయినా భయపడతాడు అన్నట్లు మంచిగా చెప్తే ఎవరూ వినరని తెలుసుకున్నారు. చివరకు కట్టుకున్న మొగుడయినా కష్టపెడతే కన్నెర్రజేస్తామని హెచ్చరిస్తున్నారు.
అలాంటిదే ఈ సంఘటన. విజయనగరం జిల్లాలో కట్టుకున్న భర్తను సజీవ దహనం చేసిందో భార్య. గరివిడి మండలం వెదుల్ల వలసలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుటుంబంలో కొద్దికాలంగా గొడవలు అవుతున్నాయి. తరుచుగా కలహాలు ఏర్పడటంతో పాటు, భార్యను చంపేయటానికి భర్త ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆ మహిళ భద్రకాళీ అవతారమెత్తింది. తనపై దాడికి దిగిన భర్తను తల్లి సహకారంతో చెట్టుకు కట్టేసింది. తనను చంపటానికి ప్రయత్నించిన భర్తను సజీవ దహనం చేసింది. విషయం తెలుసుకున్న పోలిసులు తల్లి, కూతురును అరెస్టు చేశారు. కుటుంబ వివాదాల వల్లే ఈ ఘటన జరిగిందని వారు వివరణ ఇచ్చారు. కూర్చుని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్యైనా పరిష్కారమవుతుంది. ఆవేశంలో భర్త అలా చేసుండకూడదు. లేదంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారు జైలుకు వెళ్ళేవారు కాదు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more