సోనియా గాంధీ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అండ్ బ్రాండ్ అంబాసిడర్. మన భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒంటిచేత్తో దేశాన్ని నడిపిన ఏకైక మహిళ! ఈమె రాజకీయ రణరంగంలో అడుగుపెట్టినప్పుడు ప్రపంచంలో వున్న ఎంతోమంది ప్రముఖులు ఈమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఎందరో అభిమానాలు తెలిపారు. మొదట్లో ఈమె పాలన కూడా చాలా బాగానే వుందంటూ మన దేశ నాయకులు కూడా ఒప్పుకున్న రోజులున్నాయి. ఈమె పేరు చెప్పుకుని ఎందరో రాజకీయనాయకులు కాలం గడిపినవారు వున్నారు.
కానీ కాలక్రమంలో ఏమైందోఏమో తెలీదుకానీ.. ఈమెకు వ్యతిరేక పవనాలు వీచడం మొదలయ్యాయి. ఒక్కొక్కొ రాష్ట్రంలో ఈమెకు వ్యతరేకంగా ప్రాంతీయపార్టీలు ధ్వజమెత్తడం ప్రారంభించాయి. సోనియాగాంధీ పాలన అస్సలు బాగోలేదని అందరూ విమర్శించడం మొదలుపెట్టేశారు. దీంతో కాంగ్రెస్ కో ఇండియా సే హటావ్ అంటూ నినాదాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలయ్యింది. ఈమె సామ్రాజ్యం మొత్తం ఒకేసారి మంటలో కలిసిపోయింది. ఇదీ ఆమె చరిత్రకు సంబంధించి ఒక చిన్న కథ!
చెప్పుకోవడానికి చాలానే వుందికానీ.. ప్రస్తుతం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది! ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో సోనియమ్మ నరేంద్రమోడీపై రోజురోజుకు రకరకాలుగా విమర్శలు చేయడం ప్రారంభించింది. మోడీ ఒక మతతత్వ నాయకుడంటూ ధ్వజమెత్తింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన రాష్ట్రంలోనే గోద్రా ప్రాంతంలో మతహింస ఘటనలు చోటు చేసుకున్నది మోడీవల్లేనంటూ ఆమె ఆరోపణలు చేశారు. అయితే ఆయన ప్రమేయం అందులో ఏమీ లేదని కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ.. ‘‘మరి మోడీ 3 రోజుల దాకా జరుగుతున్న ఆ ఘటనలను చూస్తూ ఎందుకు ఊరికే వుండిపోయాడంటూ’’ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు!
ఇప్పుడు తాజాగా కూడా సోనియా గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దేశంలో మతఘర్షణలు మరీ ఎక్కువగా పెరిగిపోయానని.. ఇప్పటివరకు దాదాపు 600 మతహింస ఘటనలు చోటు చేసుకున్నాయని ఆమె లెక్కలు చూపించారు. ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజలను చీలుస్తోందని.. ఇటువంటి పార్టీని దేశం నుంచి బహిష్కరించాల్సిందేనని ఆమె మండిపడ్డారు. విద్రోహ శక్తులను ఎదుర్కోవడానికి అందరూ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈమె చేస్తున్నవిమర్శలకు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.. ‘‘అమ్మా సోనియా.. ఏందమ్మా నీగోల! ఇప్పటికైనా విమర్శలు చేయడం చాలించు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more