రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? అనే సామెత గుర్తుంది కదా! తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా ఇదే విధంగా వ్యవహరిస్తోంది. తమకు నచ్చినవారికి పదవులు, కేబినెట్ స్థాయి పోస్టులు కట్టబెడుతూ.., తమను ఆరిపోసుకునేవారిపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పుడిలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.., టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రభుత్వం ఎస్కార్టును తొలగించింది. అయితే ఇది గతంలో ఎప్పుడైనా చేసుంటే సరేలే అనుకునేవాళ్ళం. కానీ కేసీఆర్ పరిపాలనపై ఎర్రబెల్లి కామెంట్లు చేసిన రోజునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎర్రబెల్లి ఏమన్నారంటే...!!
ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలపై కేసీఆర్ చేస్తున్న విమర్శలకు దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాసయిన తర్వాత నగరానికి వచ్చిన కేసీఆర్ కు టీఆర్ఎస్ నేతలు ఒంటెలు, గుర్రాలు, కాన్వాయ్ లతో స్వాగతం పలికారు. మరి ఆ సంబరాల సమయంలో సెక్షన్ల లెక్కలు, బొక్కలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో మాట్లాడకుండా.., ఎవరినీ మాట్లాడనీయకుండా చేసి తెలంగాణ క్రెడిట్ కొట్టిసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం పబ్బం గడుపుకునేందుకు రోజుకో మాట చెప్తున్నారని మండిపడ్డారు. అంతేకాక గవర్నర్ అధికారాలపై అనవసరంగా మోడి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ద్వజమెత్తారు. బిల్లు పాసయింది యూపీఏ హయాంలో, కేవలం అమలు పరుస్తోంది మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం తెలుసుకోకుండా మోడి ఫాసిస్టు, చంద్రబాబు ద్రోహి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయటం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అనే కనీస పరిణితి లేకుండా తెలంగాణ సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈ మాటలతో కేసీఆర్ సారుకు చిర్రెత్తుకొచ్చింది. మన ప్రభుత్వ భద్రతలో ఉండి మనల్ని తిట్టడమేంటి అనుకున్నారో, మరింకేమైనా అనుకున్నారో.., మొత్తానికి సరైన కారణమేంటో చెప్పలేదు కానీ దయాకర్ రావుకు ఇంతకాలం కల్పిస్తున్న ఎస్కార్టును తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు బయటకు వచ్చాయి. ఇంకేముంది ఇన్ని రోజులూ ఎస్కార్టు వాహనంతో, ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిన ఎర్రబెల్లి గారు ఇకపై సోలో వాహనంలో వెళ్ళక తప్పదు. మరి ప్రతిపక్షం గొడవ చేసి.., పరిస్థితి మారి తిరిగి ప్రభుత్వం మనసు మారితే తెలియదు కాని.. అప్పటివరకు ఇదే పరిస్థితి.
ప్రభుత్వానిది కక్ష్యసాధింపు : ఎర్రబెల్లి
తనకు ఎస్కార్టును తొలగించారన్న విషయం తెలిసిన ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపోయారు. ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ద్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు కుట్రపూరితంగా వ్యవహరించటం సరికాదన్నారు. తనపై కక్ష్య సాధింపు చర్యలతో ప్రభుత్వానికే నష్టమని హెచ్చరించారు. ఎస్కార్టును తొలగించి కేవలం గన్ మెన్లను పంపటంతో.., ఆగ్రహంతో ఊగిపోయారు. తనకు గన్ మెన్లు కూడా అవసరం లేదనీ.., వారిని కూడా వెనక్కి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more