రాష్ర్టం విడిపోయింది. హైదరాబాద్ రెండు రాష్ర్టాలకు తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా పేరుకు మాత్రమే ఉంది. ఏపీ మంత్రులు, ముఖ్యమంత్రి ఎక్కువగా ఆంద్రప్రదేశ్ లోనే గడుపుతున్నారు. వీలైనంత త్వరగా ఏపీ అధికారులను తరలించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అటు తమ రాష్ర్టంలో పాలన జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే వీటన్నిటికి పరిష్కారం చూపే రాజధాని వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. అదేమంటే రాజధాని అంటే అంత ఆషామాషి కాదని అందుకోసం ఏర్పాటైన శివరామక్రుష్ణన్ కమిటి అంటోంది.
రాజధాని పూర్తిస్థాయి నిర్మాణం జరగాలంటే ముప్పై నుంచి వంద సంవత్సరాల సమయం తీసుకుంటుందని కమిటి చెప్తోంది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాతి తరాలన్నీ బాదపడాల్స ఉంటుందని, తొందరపాటు ప్రభావం భవిష్యత్ తరాలపై చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నందునే సమయం ఎక్కువ అవుతుందన్నారు. అయినంత మాత్రాన వచ్చిన నష్టమేమి లేదని చెప్తున్నారు. త్వరలోనే తుది నివేదిక తయారు చేసి కేంద్రానికి అందిస్తామని చెప్పారు.
అటు ఇవాళ కడపలో పర్యటించిన శివరామక్రుష్ణన్ కమిటి తెరపైకి కొత్త అంశాన్ని తీసుకువచ్చింది. అదే ఏపీకి రెండు రాజధానులు. ఈ వాదన తెరపైకి రావటానికి పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ, ప్రాంతీయ సమతుల్యత, ప్రజల మనోభావాలను గౌరవించటంతో పాటు వనరుల లభ్యతలు ప్రభావం చూపుతున్నాయి.
రాజధాని పేరుతో విభజనకు ముందే గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడు సెంటు భూమి కూడా దొరకటం లేదు. అంతదాకా ఎందుకు ప్రభుత్వం రాజధానిపై ఇస్తున్న లీకులతో ఇంటి యజమానులు అద్దెలను భరించలేనంతగా పెంచేస్తున్నారు. అదేమంటే ఇష్టముంటే ఉండండి లేదా వెళ్ళిపొండి అంటున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ముందుగా రాజధాని నిర్మించాలని భావించినా ప్రస్తుత పరిస్థితులతో ప్రధాన్యతలు మారుతున్నట్లు తెలుస్తోంది. పరిమిత భూ లబ్యత నేపధ్యంలో ఇక్కడ పరిపాలనా రాజదాని నిర్మించి.., మిగతా కార్యక్రమాలు అంటే కోర్టు, శాఖల ప్రధాన కార్యాలయాలను మరొక చోటు నుంచి నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల నిర్మాణ వ్యయం తగ్గటంతో పాటు, అన్ని ప్రాంతాలు అబివృద్ధి చెందినట్లవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక రాజధాని విషయమే పరిష్కారం కాలేదు. మరి రెండు రాజధానులంటే అదెంత సమయం పడుతుందో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
RK
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more