కలియుగంలో ఇదో మహా అద్భుతం. దేవుడు ఈ భూమి మీద లేడని ప్రచారాలు చేసుకునే నాస్తికులకు ఇదొక ప్రత్యక్ష్య సాక్ష్యం! మనం పురాణాల్లో చదివే వుంటాం... ఆనాడు మాటలు రాని మూగవాళ్లకు దేవుళ్లు వరాలిచ్చి తిరిగి వారికి మాటలు వచ్చేలా చేసేవారని! అలాగే ఘోర తపస్సు చేస్తే సాక్షాత్తూ భగవంతుడే ప్రత్యక్ష్యమై భక్తులు కోరికలను తీర్చేవారు. అయితే ఇవన్నీ కేవలం కట్టుకథలేనని కలియుగంలో వున్న ప్రజలందరూ కొట్టిపారేస్తుంటారు. కానీ ఈ యుగంలో కూడా అటువంటి పురాణానికి సంబంధించిన ఒక ఘటన తిరుమల దేవస్థానంలో వెలుగుచూసింది.
లండన్ కు చెందిన ఎన్నారై దంపతులకు దీపక్ అనే కొడుకు వున్నాడు. అయితే అతను పుట్టుకతోనే మూగవాడు. అతనికి మాటలు వచ్చేందుకు అతని తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతోమంది స్పెషలిస్ట్ డాక్టర్లనూ సంప్రదించారు. అయినా ఫలితం దక్కలేదు. కానీ వారు పట్టువీడకుండా తమ బిడ్డను నాలుగేళ్లక్రితం లండన్ లోనే స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. అయినప్పటికీ అతనికి మాటలు మాత్రం రాలేదు. కేవలం పెదాల కదలికలు వుండేవి కానీ.. మాటలు మాత్రం వచ్చేవి కావు. దీంతో తమబిడ్డకు మాటలు రావట్లేదన్న బాధతో వారు ప్రతిరోజూ కుమిలిపోయేవారు.
అయితే శనివారంనాడు (09-08-2014) ఈ ఎన్నారై కుటుంబ సభ్యులు తమ కొడుకు దీపక్ తో కలిసి... చాలాఏళ్లక్రితంనాటి స్వామివారి మొక్కును తీర్చుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుంటూ ‘‘తమ బిడ్డకు మాటలు రప్పించేలా చేయు స్వామి’’ అని తల్లిదండ్రులు దేవుడిని కోరుకున్నారు. అంతే! దర్శనం అయిన తర్వాత తమ బిడ్డ దీపక్ నోటి నుంచి ‘‘అమ్మా’’ అనే పదం స్పష్టంగా వినిపించింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లూ ఎన్ని చికిత్సలు చేయించినా ఏమి కాలేదని పేర్కొన్నవారు... అంతా స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని తెలిపారు. ఈ సంఘటన యాధృచ్ఛికమో లేక దేవలీలో తెలియదు కానీ.. ఆధునిక యుగంలో ఇలా జరగడం నిజంగానే మహాధ్భుతం!
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more