Pm narendra modi nepali son jeeth becomes controversial

pm narendra modi latest news, narendra modi jeeth, narendra modi father jeeth, nepali boy jeeth narendra modi, narendra modi speech nepal, narendra modi nepal tour, narendra modi world tour

pm narendra modi nepali son jeeth becomes controversial : pm narendra modi becomes a father to a nepali son who came from nepal with his brother before long ago. but when they were returning to their home town the boy who's name is jeeth has missed the train and climes another one which was went to gujarath

మోడీ తండ్రి అయ్యాడు..?

Posted: 08/06/2014 03:44 PM IST
Pm narendra modi nepali son jeeth becomes controversial

అవును... మీరు వింటున్నది నిజమే! నరేంద్రమోడీ తన వ్యక్తిగత జీవితం గురించి ఇన్నాళ్లవరకు బయటపెట్టలేదు కానీ.. తాజాగా ఈయన తండ్రి అయ్యాడంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా నేనింకా బ్రహ్మచారినేనంటూ ప్రచారాలు చేసుకున్న నరేంద్రమోడీ.. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన వివాహబంధం గురించి, తన భార్య గురించి కొన్ని విషయాలను బహిర్గతం చేశాడు. కానీ వారిద్దరి మధ్య వివాహ బంధం కేవలం కొన్నికాలాలకే పరిమితం కావడంతో వీరికి సంతానం కలుగలేదు. కానీ ఇప్పుడు నరేంద్రమోడీకి ఒక కొడుకు వున్నాడంటూ పుకార్ల మీద పుకార్లు షికార్లు చేస్తూ తిరుగుతున్నాయి.

అతని పేరు జీత్! నిన్నమొన్నటివరకు ఈ అబ్బయి ఎవరనే విషయం తెలియదు కానీ.. ఇప్పుడు వార్తల్లో తిరుగుతూ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఈ అబ్బాయే నరేంద్రమోడీ కొడుకు అంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. కానీ ఇతను మోడీ కొడుకులాంటివాడే కానీ ఆయన కొడుకు మాత్రం కాడు. అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ఎప్పుడో చిన్నప్పుడు తన అన్నయ్యతో కలిసి నేపాల్ నుంచి ఇండియాకు వచ్చిన జీత్ అనే అబ్బాయి.. కొన్నాళ్ల తరువాత తిరిగి నేపాల్ కు వెళ్లిపోయే క్రమంలో పొరపాటున వేరొక ట్రెయిన్ ఎక్కేశాడు. అదే అతనికి అదృష్టంగా మారింది. ఆ ట్రెయిన్ నేరుగా గుజరాత్ కు చేరుకుంది. అతని అదృష్టమే అతనిని నరేంద్రమోడీ దృష్టిలో పడేలా చేసింది. ఇక అంతే సంగతులు!

అప్పుడు దొరికిన జీత్ ను నరేంద్రమోడీ పెంచి, పెద్దచేసి విద్యాబుద్ధులన్ని నేర్పించాడు. తన సొంత కొడుకు కాకపోయినా ఒక తండ్రిలా అతని ఆలనాపాలనా చూసుకుంటూ తనకాళ్ల మీద తాను స్వయంగా నిలబడేలా చేశాడు. చివరికి మోడీ తన నేపాల్ పర్యటనలో భాగంగా అతనిని తన కుటుంబం చెంతకు చేర్చాడు. ఇది నరేంద్రమోడీలో దాగివున్న నిజమైన మానవత్వం! దీంతో మొన్నటివరకు బాహ్యప్రపంచానికి తెలియని ఆ అబ్బాయి కూడా నేడు హీరోగా అవతారమెత్తాడు. ఇటు భారత్, నేపాల్ దేశాల్లో సెలబ్రిటీగా మారిపోయాడు. తండ్రిలాంటి మోడీ దగ్గర పెరిగిన కొడుకు జీత్ అంటూ అతని గురించి వార్తాసారాంశాలు కూడా వచ్చేశాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more