సాధారణంగా మైక్రోస్కోప్ లను ఉపయోగించి ఎంతటి చిన్న వస్తువునైనా శీఘ్రంగా చూడవచ్చు. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను ఎంతో పెద్ద పరిమాణంలో దీని ద్వారా వీక్షించవచ్చు. ప్రముఖ కాలేజీల్లో వీటి వాడకం చాలా ఎక్కువ! అయితే దీనిని కొలుగోలు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి.. ఇంతవరకూ కొన్ని కళాశాలల్లో వీటిని ఉపయోగించడం లేదు. కానీ స్మార్ట్ ఫోన్లు మాత్రం ఆ లోటును తీర్చడానికి సిద్ధంగా వున్నాయని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు. మన దగ్గర స్మార్ట్ ఫోన్ వుంటే చాలు.. మైక్రోస్కోప్ అవసరం లేకుండానే సూక్ష్మజీవులను చూడవచ్చునని వారు స్పష్టం చేస్తున్నారు.
కేవలం 600 డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10 వేల రూపాయలతోనే స్మార్ట్ ఫోన్ సహాయంతో మైక్రోస్కోప్ ను తయారుచేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే నట్లు, బోల్టులు, లేజర్ లైట్స్, ప్లైవుడ్స్ లాంటి పరికరాలను కొనుగోలు చేసి, వాటిని మైక్రోస్కోప్ తరహాలో బిగించుకుంటే చాలు.. సూక్ష్మదర్శిని రెడి అయిపోనట్టే! ఈ విధంగా స్మార్ట్ ఫోన్ తో తయారుచేసుకున్న సూక్ష్మదర్శినిని ఉపయోగించి.. వస్తువులను 175 నుంచి 400 రెట్లు పెద్దవిగా చూసుకోవచ్చుని నిపుణులు కొన్ని ప్రయోగాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. మిస్సోరి యూనివర్సిటీ విద్యార్థులు ‘‘డూ ఇట్ యువర్ సెల్ఫ్ మైక్రోస్కోప్’’ పేరు స్మార్ట్ ఫోన్ మైక్రోస్కోన్ ను తయారుచేసి నిరూపించారు. అంటే.. ఇకపై స్మార్ట్ ఫోనే మైక్కోస్కోప్ అన్నమాట!
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more