Telangana to go separate for eamcet counselling

AP EAMCET, TELANGANA EAMCET, TELANGNA EAMCET CONCELING, TELANGANA students agitation, EAMCET admissions counseling

TElangana says separate EAMCET counseling will be done

AP EAMCET కౌన్సిలింగ్‌తో టి.విద్యార్దులకు సంబంధం లేదు

Posted: 07/29/2014 03:26 PM IST
Telangana to go separate for eamcet counselling

ఆగస్టు నాలుగో తేదీ తర్వాత సుప్రింకోర్టు ఇచ్చే ఆదేశాలను కూడా గమనంలోకి తీసుకుని ఎమ్సెట్ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ విద్యా మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కౌన్సిలింగ్‌తో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు పరిధిలో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం 1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకు మాత్రమే బోధన ఫీజులు చెల్లిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించడంతో అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనిపై గత రెండు నెలలుగా వాదప్రతివాదాలు సాగడంతో కౌన్సిలింగ్ నిర్వహణపైనే సందిగ్ధత ఏర్పడింది. స్థానికత, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నెలకొన్న వివాదంతో మిగిలిన కోర్సుల్లో అడ్మిషన్లపైనా ప్రభావం పడింది. ప్రతి ఏడాది ఆగస్టు 1నాటికి తరగతులు ప్రారంభం కావల్సి ఉండగా, ఈ ఏడాది తొలి దశ కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వివాదాలు హెచ్చుమీరి కౌన్సిలింగ్‌కు ఆటంకం కలగటంపై విద్యార్ధుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
రెండు రాష్ట్రాల విభజనకు ముందే ఎమ్సెట్ పరీక్ష నిర్వహించడం, ఫలితాలు ఇవ్వడం జరిగిపోయింది. ర్యాంకుల ప్రకటన కూడా పూర్తికావడంతో అడ్మిషన్లు కూడా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగానే జరగాలని కేంద్రప్రభుత్వం సూచించింది.

అత్యంత ప్రధానమైన శాఖల పరిధిలో విద్యాశాఖను చేర్చడంతో ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి అడ్మిషన్లను చేపట్టాల్సి ఉంది. ప్రవేశపరీక్షల కమిటీల ఏర్పాటు, నిర్వహణ, అడ్మిషన్ల వరకూ అన్ని అంశాలనూ ఉన్నత విద్యా మండలి పర్యవేక్షిస్తోంది. అడ్మిషన్ల దశలో అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చూస్తుండగా, మెడిసిన్ అడ్మిషన్ల వ్యవహారాన్ని ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ చూస్తోంది. ఇక ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల అడ్మిషన్లను సాంకేతిక విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. వృత్తి- సాంకేతిక విద్యాకోర్సులకు సంబంధించి ఉమ్మడిగా అడ్మిషన్ల సాంకేతిక వ్యవహారాలు చూసేందుకు ప్రొఫెసర్ రఘునాధ్ నాయకత్వంలో బృందం గత పదేళ్లుగా పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే జూన్ రెండోవారంలో ఇంజనీరింగ్ అడ్మిషన్లను చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావించినా, అందుకు తగ్గ అనువైన వాతావరణం లేకపోవడం, ఇరు రాష్ట్రాల విద్యామంత్రులు బాధ్యతలు స్వీకరించడం తదితర వ్యవహారాలతో జూన్ చివరిలో అడ్మిషన్లను ప్రారంభించాలని మండలి యోచించింది. అంతలో తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయం అందించే విషయంలో రీయింబర్స్‌మెంట్ పథకం స్థానే 'సాఫ్ట్' పేరిట మరో కొత్త పథకాన్ని ప్రారంభించడం, స్థానికతకు 1956ను కటాఫ్ తేదీగా నిర్ణయించడంతో వివాదాలు మొదలయ్యాయి. ప్రధానంగా గత కొద్ది దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చింది. మరో పక్క ఈ అంశంపై స్పష్టత పెంచుకునేందుకు తమకు కొంత వ్యవధి కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. కేసు విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు తాము అడ్మిషన్ల ప్రక్రియను ఆపాలని ఆదేశించలేదని స్పష్టం చేయడంతో ఉన్నత విద్యామండలి మరోమారు సోమవారం నాడు సమావేశమై కీలక నిర్ణయాలను తీసుకుంది.

---

The controversy over the commencement of Eamcet counselling in the Telangana state and Andhra Pradesh deepened  with the AP State Council of Higher Education deciding to go ahead with the issue of counselling notifications on July 30 despite the TS government boycotting a meeting convened for the purpose.

Engineering, Agriculture and Medical Common Entrance Test (EAMCET) is conducted by Jawaharlal Nehru Technological University Hyderabad on behalf of APSCHE. This examination is the prerequisite for admission into various professional courses offered in University/ Private Colleges in the state of Andhra Pradesh.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more