డాక్టర్లు టెస్ట్ లు చేయించమని ల్యాబ్స్ కి రాయటం, వాళ్ళు టెస్ట్ లు చేసి రిపోర్ట్ లు ఇవ్వటం, దాన్ని పరిశీలించినట్లుగా నటించి తమ ధోరణిలో మందులు రాసి వైద్యం చెయ్యటం, ఆ తర్వాత సదరు ల్యాబ్స్ నుంచి డాక్టర్లకు డబ్బు ముట్టటం అనేది ఎప్పటి నుంచో అందరూ అనుమాన పడుతున్నదే, కానీ అదంతా ఒక టివి స్టింగ్ ఆపరేషన్ లో కేమెరాలో బంధించటం జరిగింది. ల్యాబ్స్ నుంచి 50 శాతం వరకు డాక్టర్లకు అందిన సందర్భాలున్నాయి.
మామూలుగా అయితే అన్ని టెస్ట్ ల అవసరం పడదు కాబట్టి డయగ్నస్టిక్ సెంటర్లకు అంత ఆదాయం ఉండదు. కానీ డాక్టర్లను తెరవెనుక భాగస్వాములను చేసి వాళ్ళ ద్వారా కస్టమర్లు వచ్చేట్టుగా చేసుకుని లాభాలు గడిస్తున్నారు. అందుకు గాను డాక్టర్లకు అందులో పెద్ద శాతమే ముట్టచెప్తున్నారు.
న్యూ నేషన్ అండర్ కవర్ రిపోర్టర్లు ఒక ల్యాబొరేటరీకి వెళ్ళి విచారించగా ఆ ల్యాబ్ 10000 మంది డాక్టర్లతో అవినీతి ఒప్పందం చేసుకుందని తెలిసింది. వాళ్ళందరిలో ఖరీదైన టెస్ట్ లు రాసిన న్యూరో సర్జెన్లకి నెల నెలా ఎన్నో పదివేల రూపాయల వరకు ముడుపులు అందుతున్నాయి.
న్యూనేషన్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వలన బయట పడ్డ ఈ ఉదంతం మీద భారత సర్కార్ దర్యాప్తుకి ఆదేశాలిచ్చింది. ఇది దేశం సిగ్గుపడవలసిన విషయమంటూ ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు. డాక్టర్లు ల్యాబ్ లకు టెస్ట్ లకు పంపించి అక్కడి నుండి లంచాలు తీసుకోవటమనేది చాలా హేయమైన పనని, వాళ్ళ మీద ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఆదేశాలివ్వటం జరిగిందని అన్నారు.
దీన్ని చూస్తే ఇంకా వెలుగు చూడని ఎన్ని కేసులున్నాయో అంచనా వెయ్యటం కష్టం కాదు. రోగి వస్తే చాలు వలలో చేప పడ్డట్టేనని భావించే డాక్టర్లు ఎంతో మంది ఉన్నారన్నది ప్రతి ఒక్కరి అనుభవం. రాగానే వాళ్ళని భయపెట్టటం, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే ఒకలాగా లేకపోతే మరోలా చికిత్స చెయ్యటం లాంటివి ఎవరికి వారు
కనిపెట్టినా ఎవరూ ప్రతిఘటించటానికి ముందుకు రాలేకపోయారు.
న్యూ నేషన్ టివి వాళ్ళు చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ ని డాక్టర్లు హెచ్చరికల్లా తీసుకోవాలని మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్లో పోస్ చేసారు.
దేశంలో వైద్యరంగంలో ఉన్న అవినీతిని నిరోధించటానికి నడుం కట్టిన కొందరు డాక్టర్లు, అడ్వకేట్ల బృందం హాస్పిటల్స్ లో అవినీతి నిరోధక బృందాలను తయారుచేస్తున్నారు. వాళ్ళు ఈ విషయంలో హర్షవర్ధన్ కి లేఖలు రాసారు. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్ స్టిట్యూట్ లోని డాక్టర్ భార్గవ తక్కవ టెస్ట్ లతో వైద్యం అనే లక్ష్యంతో ఒక సంఘాన్ని తయారు చేసారు. అయితే సమాజంలో పేరుకుపోయిన అవినీతి ఒక్కసారికే పోదని, క్రమంగా దాన్ని అణచివేయవలసివస్తుందని అన్నారు.
ప్రాణాలను కాపాడే వైద్యులను రోగులు, వాళ్ళ కుటుంబీకులు కొన్ని సందర్భాలలో దేవుడిలా చూస్తారు. అయితే వాళ్లల్లో కొంతమంది రోగులను బలికి వచ్చిన గొర్రెల్లా చూడటం మొదలుపెట్టటం వైద్య వృత్తికే మాయని మచ్చ. నిజంగా వృత్తికి గౌరవమిస్తూ నిజాయితీగా వైద్యసేవలందించేవారున్నారు. కానీ కొందరు లంచావతారాల మూలంగా వైద్యరంగాన్నే సందేహ దృష్టితో చూడటం జరుగుతోంది. దాన్ని రూపుమాపటానికే కొందరు వైద్యులు ఈ అవినీతిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కార్పోరేట్ హాస్పిటల్స్ లో వైద్యం జరిగేది అక్కడే, టెస్ట్ లు కూడా ఇన్ హౌస్ ల్యాబ్స్ లో జరుగుతాయి, మందులు కూడా అందులోవే కాబట్టి చివరకు ఎంత బిల్లు వేస్తే అంత.
సర్వేలు చెప్తున్న దాన్నిబట్టి డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రస్తుతం దేశంలో బాగా పుంజుకుంటున్న వ్యాపారం. కొందరు డాక్టర్ల పుణ్యమాంటూ చేతినిండా పని ఉంటోంది వాటికి.
ఈ స్టింగ్ ఆపరేషన్, ఆ తర్వాత దర్యాప్తులు దేశవ్యాప్తంగా ఎంత ప్రభావాన్ని చూపుతాయో చూడవలసివుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more