(Image source from: karntaka high court rejects appeal of nityananda swamy and orders to make medical test for him)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు అయిన నిత్యానందస్వామి... ఈసారి అడ్డంగా దొరికిపోయాడు. నిత్యానందునికి వెంటనే పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రామనగర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై వున్న స్టేను ఎత్తివేసిన హైకోర్టు.. ఈనెల 28వ తేదీన నిత్యానందునుని అదుపులోకి తీసుకుని వెంటనే పురుషత్వ పరీక్షలు నిర్వహించాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది.
గతంలో నిత్యానందునికి, సినీ నటి రంజితతో శారీరక సంబంధాలున్నాయన వార్తలు దేశంమొత్తం మీద పెద్దదుమారం రేగిన సంగతి తెలిసిందే! అలాగే నిత్యానందుడు తనను శారీరకంగా వేధిస్తున్నాడని, చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తన మాజీ శిష్యురాలు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నిత్యానందుని కోసం గాలింపు చేపట్టారు. అయితే అతను మాత్రం దొరకకుండా తెలివిగా పరుగులు తీశాడు. దీంతో ఇతని కేసు కోర్టుకు ఎక్కింది. కేసును విచారించిన రామనగర్ సెషన్స్ కోర్టు... వెంటనే నిత్యానందునుని అరెస్టు చేసి, అతనికి పురుషత్వ పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశించింది.
అయితే ఈ వ్యవహారంలో నిత్యానందుడు తనను లైంగిక వేధింపుల కేసు నుంచి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతూ కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అందులో తాను బాలుడితో సమానమని, తనలో సెక్స్ సామర్థ్యాలు అస్సలు లేవని కోర్టుకు చెప్పుకున్నాడు. ఇతని వాదనను విన్న కోర్టు పురుషత్వ పరీక్షలపై స్టే విధించింది. ఈ కేసు గత రెండు సంవత్సరాల నుంచి పెండింగులోనే వుంది.
ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి విచారించిన హైకోర్టు.. స్టేను ఎత్తివేసింది. వెంటనే నిత్యను అరెస్టు చేసి పురుషత్వ పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశించింది. ఇందులో భాగంగానే నిత్యానందుని తరఫున లాయర్ వాదిస్తూ... నిత్యానందుడు లొంగిపోవడానికి కనీసం ఒక వారంరోజుల వరకు గడువు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఒకవేళ్ల అప్పట్లో లొంగకపోతే అతనిని అరెస్టు చేసుకోవచ్చునని వెల్లడించాడు. అయితే ఈ అప్పీల్ ను కూడా హైకోర్టు కొట్టివేస్తూ... ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు నిత్యానందునుని అరెస్టు చేసేకుని రంగం సిద్ధం చేసుకుని, వేటలో మునిగిపోయారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more