పరిచయం కోసం ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే.. ప్రాణం తీసింది! కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ మా కుటుంబం లో చీకటి పేజీలు నింపిందని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. కేవలం నాలుగు రోజుల ఫేస్ బుక్ స్నేహమే.. అమ్మాయి ప్రాణాలు తీసిందని ఆమె స్నేహితులు అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..! గుంటూరుకు చెందిన సూరజ్ సింగ్ తో ఈనెల 11న ఫేస్ బుక్ ద్వారా స్వాతికి పరిచయమేర్పడింది.
స్నేహితులుగా మారిన వీరు 12న ఛాటింగ్ లో ఫోన్ నెంబర్లు తెలుసుకున్నారు. స్వాతి ట్రిపుల్ ఐటీలో ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు తల్లితో కలిసి గుంటూరు వచ్చింది. అక్కడ నుంచి స్నేహితులతో వెళతానని స్వాతి చెప్పడంతో మధ్యాహ్నం 2.30కు బస్టాండు వద్ద కుమార్తెను వదిలి తల్లి వెళ్లిపోయింది. రాత్రి 8.30 సమయంలో ఇద్దరూ గుంటూరు నుంచి మోటార్ సైకిల్ పై నూజివీడు బయలుదేరారు.
త్రిపుల్ ఐటీకి చేరుకునేసరికి రాత్రి 12.30 గంటలయింది. ఆ సమయంలో హాస్టల్ యాజమాన్యం లోపలికి అనుమతించేందుకు నిరాకరించడంతో వీరు తిరిగి గుంటూరు ప్రయాణమయ్యారు. చినకాకాని వద్దకు వచ్చేసరికి రాత్రి 2.40 గంటల ప్రాంతంలో స్వాతి చున్నీ మోటారు సైకిల్ వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె అదుపు తప్పి మోటార్ సైకిల్ పైనుంచి కిందకు పడిపోయింది. తలకు బలంగా దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.
చిలకలూరిపేటకు చెందిన పినిపే సంధ్యారాణి కుమార్తె స్వాతి. సంధ్యారాణి భర్త మాజీ సైనికోద్యోగి. ఆయన కొంతకాలం క్రితం మృతి చెందారు. భర్త పింఛను ఆధారంగా స్వాతిని సంధ్యారాణి నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదివిస్తున్నారు. ఇటీవల రెండో సెమిస్టరు పరీక్షలు పూర్తయ్యాక స్వాతి సెలవులకు వచ్చి ఇంటి వద్దనే ఉంది. ఇంతలోనే ఫేస్ బుక్ ప స్నేహితుడి కోసం వెళ్లి.. ఇలా తిరిగిరాని లోకలు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more