దేశంలో గవర్నర్ల కొరత (?) బాగా కనబడుతోంది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ రాష్ట్ర విభజన దృష్ట్యా విభజించబడ్డ రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారంటే దానికి అర్థం కనిపిస్తోంది. కానీ తమిళనాడు గవర్నర్ రోశయ్య కర్నాటక గవర్నర్ గా కూడా బాధ్యతలను చేపట్టారు.
కథ ఇంతటితో ఆగిపోలేదు రాజస్తాన్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న మార్గరెట్ ఆల్వా జూలై 8న గుజరాత్ కి కూడా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ముడుపులు అందుకున్న అభియోగాన్ని సిబిఐ చెయ్యటంతో గోవా గవర్నర్ వాంఛూ రాజీనామా చెయ్యటంతో ఆ బాధ్యతలను కూడా మార్గరెట్ అల్వా చూసుకుంటున్నారు.
ఈరోజు గోవా గవర్నర్ గా మార్గరెట్ ఆల్వా ప్రమాణస్వీకారోత్సవానికి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, మంత్రులు, అధికారులు, విఐపిలు పాల్గొన్నారు.
ఈ లోపులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమించిన గవర్నర్లకు ఉద్వాసన చెప్పే కార్యక్రమంలో పడ్డ భాజపా ఒత్తిడికి కొందరు పదవి నుంచి తొలగిపోయారు కానీ మరికొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more