రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ పై రాజకీయ నేతలు దాడి చేయటం మొదలుపెట్టారు. పేదారికంపై రంగరాజన్ విసిరిన రాయే ఇందుకు కారణమని తెలుస్తోంది. పేదరిక నిర్ధారణకు గీటురాయిగా పరిగణించే దారిద్ర్య రేఖ పరిమితిని నివేదిస్తూ రంగరాజన్ కమిటీ సమర్పించిన నివేదికపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించాయి.
ఇటు విపక్షాలతో పాటు అటు అధికార పార్టీ భాజపా కూడా విస్మయం వ్యక్తం చేశాయి. రోజుకు పట్టణాల్లో రూ. 47, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 32ల కంటే ఎక్కువగా ఖర్చు చేసే వారంతా ధనికులేనని రంగరాజన్ కమిటీ నివేదిక ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పివేదికపై సోమవారమే బీఎస్పీ లాంటి కొన్ని పార్టీలు విరుచుకుపడగా, తాజాగా కాంగ్రెస్ పార్టీతో పాటు భాజపా కూడా ఆగ్రహం వెళ్లగక్కాయి. రంగరాజన్ కమిటీ సిఫార్సులు సవ్యంగా లేవు. దీనిపై సరైన సమయంలో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు.
ఇక రంగరాజన్ కమిటీని నియమించిన కాంగ్రెస్ పార్టీయ కూడా నివేదికపై మండిపడింది. అయితే రంగరాజన్ ను వెనకేసుకొచ్చే యత్నం చేసింది. కమిటీ నివేదన ప్రతిపాదనలకు సంబంధించి వాస్తవాలను పరిశీలిస్తాం. ఏదేమైనా రంగరాజన్ గొప్ప ఆర్థికవేత్త. నివేదికపై విస్త్రుత స్థాయిలు చర్చ జరగాల్సి ఉంది. ఆ తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది‘ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వీరప్ప మోయిలీ అన్నారు.
మరోవైపు వామపక్షాలు కూడా నివేదికపై నిప్పులు చెరిగాయి. రంగరాజన్ కమిటీ నివేదిక అర్థం లేనిదని సమాజ్ వాదీ పార్టీ ఆక్షేపించింది. రంగరాజన్ కు రోజుకు రూ. 100 ఇస్తాం, గ్రామీణ ప్రాంతంలో కొన్ని రోజులైనా గడిపి వస్తే చూస్తాం అంటూ ఆ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ సవాల్ విసిరారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more