సాటి పార్లమెంటు మెంబర్లను రేప్ చేయండని ఓ ఎంపీ పిలుపు నివ్వడం రాజకీయాల్లో కలకలం రేపింది. అపోజిషన్ పార్టీ మీద ఎంత కోపమున్నా ఆ పార్టీ మహిళా ఎంపీలను రేప్ చేయండని పిలుపునివ్వడం ఎంత వరకు సమంజసం. ఈ విచిత్రమైన కామెంట్స్ చేసింది పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ ఎంపీ. అది కూడా అధికారంలో ఉన్న తృణమూల్ పార్టీకి చెందిన ఎంపీ ఇలాంటి కామెంట్స్ చేయడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. తృణమూల్ ఎంపీ తపస్ పాల్ ఈ బెదిరింపు కామెంట్స్ చేశాడు. సీపీఎం తమ పార్టీ వర్కర్స్ ను చంపాలని ట్రై చేసినా.. దాడి చేయాలని చూసినా.. చూస్తూ ఊరుకోమన్నారు. సీపీఎం మహిళా ఎంపీలను రేప్ చేయమని తమ కార్యకర్తలకు చెబుతానని అన్నారు.
తృణమూల్ ఎంపీ తపస్ పాల్ ఓ కార్యక్రమంలో ఉపన్యసిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తపస్ వ్యాఖ్యలపై సీపీఎం నేత, ఐద్వా నాయకురాలు ఎస్.పుణ్యవతి స్పందిస్తూ ఒక మహిళ నాయకత్వంలో ఇలాంటి ప్రకటనలు రావడం సిగ్గు చేటు అని మండి పడ్డారు. తపస్ పాల్ వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. మహిళల మీద దాడి భారత ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. బెంగాల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మహిళల మీద కూడా అనేక దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.
మమతా బెనర్జీ ఎంపీ తపస్ పై క్రిమనల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార హోదాలు అనుభవిస్తున్న వారు, రాజకీయ నాయకులు ఈ మధ్యలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం తృణమూల్ రాజకీయ పరాకాష్టకు నిదర్శనమని ఆమె అన్నారు. ఖచ్చితంగా తృణమూల్ అధినేత మమతా కనుసన్నలోనే ఎంపి మాట్లాడినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎంపిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపిపై క్రిమినల్ కేసు పెట్టి అధికారం నుండి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more