ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఇప్పటికే శ్రీహరికోటలోని షార్ కి చేరుకున్నారు. చంద్రయాన్ అతిథి గృహంలో వారు బస చెయ్యనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఉదయం 3.55 ప్రాంతంలో శ్రీహరి కోటకు చేరుకుని రేపు ఉదయం జరగబోయే పిఎస్ఎల్ వి ప్రయోగ ప్రత్యక్ష వీక్షణం చేస్తారు.
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి రేపు ఉదయం ఇండియన్ స్పేస్ రిసెర్చ ఆర్గనైజేషన్ (ఇస్రో) నుంచి పిఎస్ఎల్ వి సి 23 ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, సింగపూర్ దేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పిఎస్ఎల్ వి) ఒకేసారి ప్రయోగించబడే వాహనం. అది ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టటానికి ఉపయోగపడుతుంది. దీన్ని పూర్తిగా భారతదేశంలో తయారు చెయ్యటం వలన అంతకు ముందు విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి ఇతర దేశాల నుంచి లాంచ్ చేయించిన మన శాటిలైట్ లను మనమే అంతరిక్షంలోకి పంపించగలగటమే కాకుండా ఇతర దేశాల శాటిలైట్లను కూడా మన దేశం నుంచి పంపించగలుగుతున్నాము. దానితో, విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేకపోవటమే కాకుండా విదేశీ ఉపగ్రహాలను కూడా పంపుతుండటంతో ఈ స్పేస్ ప్రాజెక్ట్ లకు మీద విదేశాలనుంచి కూడా ఆదాయం రావటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more