వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. విజయం పై ధీమా గా ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మాటల యుద్దం చేసిన విషయం తెలిసిందే. తన పార్టీ ఎమ్మెల్యేల గుండెల నిండి దైర్యాన్ని నింపుతున్నారు. జగన్ సొంత జిల్లాలలో పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే అక్కడ కార్యకర్తలను, నేతలను ఓదార్చేపనిలో చాలా బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పుడు అధికారం లేదని బాధపడకండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని జగన్ వారికి చెప్పటం జరిగింది. నాయకులతో సమావేశమై లక్ష్యాన్ని చేరుకునే వరకూ తనకు అండగా నిలవాలని కోరారు. వారికి ఎదురయ్యే ఎటువంటి సమస్యనైనా తాను ఎదుర్కొంటానని వారికి జగన్ హామీనిచ్చారు.
కడప నగర పాలక సంస్థ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో మనం 67 స్థానాలు గెలుచుకున్నాం, 2019లో ప్రజలు 167 స్థానాల్లో గెలిపిస్తారని’’ చెప్పారు. ఈ సమావేశంలో తొలుత కార్పొరేటర్లందరితోనూ జగన్ పరిచయం చేసుకున్నారు. అంతేకాకుండా వారు ఏ డివిజన్ నుంచి ఎన్నికయ్యారో అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్లందరూ, పాఠశాల తరగతి ఉపాధ్యాయుడి ముందు హాజరు వేయించుకున్న తరహాలో తమను తాము పరిచయం చేసుకున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more