అందరికి ఆధార్ కార్డు ఉండాలని గత ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఆధార్ కార్డు ఉంటే డబ్బులు ఇస్తాం అని చెప్పటానికి ఒక ముఖ్యమంత్రి రెడీ అవుతున్నారు. ఆయన ఎవరు కాదో.. ఆంద్రప్రదేశ్ ముఖ్మమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైల్ పైన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం దానిపై కోటయ్య కమిటీ వేసి, వారీ నివేదిక వచ్చినాకే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే తాజాగా మరో మాట అంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రుణమాఫీ చేయాలంటే లబ్ధిదారుడు ఆధార్ కార్డును చూపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అక్రమ లబ్ధిదారులను అరికట్టడానికే ఆధార్ లింక్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. అయితే కార్డులు లేని రైతులకు కూడా కార్డులు తీయించి లింక్ చేస్తామని చెబుతున్నారు. భూమి లేకున్నా రుణాలు తీసుకున్న వారు, ఒకే భూమి మీద నాలుగైదు సార్లు లోన్ తీసుకున్నవారు ఉన్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఈ నిర్ణయం ఇప్పుడు రైతులలో కొత్త కలవరం రేపుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆధార్ కార్డుల విషయంలో చాలా వ్యతిరేకత వ్యక్తం చేసింది ఆధార్ కార్డుల లింక్ చేసి సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు అని డిమాండ్ చేసింది. అదార్ కార్డు ఆధారం లేని కార్డు అని విమర్శలు చేసిన పార్టీ ఇప్పుడు రైతు రుణమాఫీకి ఎలా లింక్ పెడుతుంది అనే విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలోని దాదాపు 42 శాతం మంది ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఈ కార్డులు లేవు. మరి ఇలాంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలకు సీఎంబాబు ఎం సమాధానం ఇస్తారో వేచి చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more