తెలంగాణ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసానాలను మూడు రోజులుగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా స్పందించింది.
రెండు టివీ చానళ్ల (TV9, ABN) ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడంపై కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.రెండు చానెళ్ల ప్రసారాలు ఎందుకు నిలిపివేశారు? జరిగిన వాస్తవమేమిటి? నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.. కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ వ్యవస్థ కేంద్రం పరిధిలోనిదని, కేబుల్ చట్టాలను ఎలా ఉల్లంఘిస్తారని తెలంగాణ సీఎస్ను ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారట. కేబుల్ ఆపరేటర్లు చట్టాన్ని ఉల్లంఘించినట్లు రుజువు అయితే వాళ్లపై చర్యలు తప్పవని, కాబట్టి వాస్తవ పరిస్థితిని నివేదిక రూపంలో అందజేయాలని జవదేకర్ ఆదేశించారు.
జానారెడ్డి:
టీవీ9 చానెల్ తెలంగాణ శాసనసభను వ్యంగ్యంగా, అవమానించేలా ప్రసారాలు చేయడం విచాకరమని జానారెడ్డి అన్నారు. దీన్ని తాము అసెంబ్లీలో ముక్తకంఠంతో ఖండించామని గుర్తుచేశారు. అయితే, టీవీ9పై చర్య తీసుకునే అంశం స్పీకర్ పరిశీలనలో ఉండగానే.. దీనితో ఎలాంటి సంబంధం లేని ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేయడమేమిటని జానా ప్రశ్నించారు. ఇది.. జడ్జిమెంట్ రాకముందే, బెయిల్ మీద ఉన్న వ్యక్తిపై చర్య తీసుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. "ఎంఎస్వోల సంఘం, కేబుల్ ఆపరేటర్ల సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేపర్లో వార్తలు చూశాను. వారు స్వయంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే సరే.
కానీ నిర్ణయం తీసుకునే ముందు ఆయా ప్రసార మాధ్యమాల యాజమాన్యాలతో చర్చించి ఉండాల్సింది. ఇరు వ్యవస్థల మధ్య తలెత్తిన అపోహలు, వివాదాలు పరిష్కరించుకుని ఉంటే బాగుండేది. అప్పుడే ఎంఎస్వోల నిర్ణయాన్ని ప్రజలు హర్షించేవారు. కానీ అధికార ఒత్తిడి వల్లనో, ప్రోద్బలం వల్లనో ఈ నిలిపివేత నిర్ణయం తీసుకుని ఉన్నట్లయితే... అది పూర్తిగా ప్రతికార చర్య, ప్రతీకార దాడిగా, పత్రికా స్వేచ్ఛను హరించే విధానంగా ప్రజలు అనుకుంటారు '' అని జానారెడ్డి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more