తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక దాదాదాపు పదేళ్ళు ప్రతి పక్షంలో కూర్చుండి ఎట్టకేలకు అధికారాన్ని చేజిక్కుంచుకొని ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒక్కటంటే... బాబు రెండంటున్నాడు.
ఇంతకీ విషయం ఏంటంటే... కేసీఆర్ రైతుల పంట రుణమాఫీ లక్ష రూపాయలే కాకుండా, బంగారం రుణాలతో సహా చేస్తానని సభా ముఖంగా ప్రకటించాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండు పంట, బంగారం రుణాలు కలిసి రెండు లక్షల వరకు మాఫీ చేయాలని చూస్తున్నట్లు టీ.టీడీపీనేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. రైతులకు సంబంధించి గోల్డ్‌లోన్ల తో సహా రూ.2 లక్షల లోపు అన్నీ మాఫీ చేయాలనే సంకల్పంతో ఉన్నారని, మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నారని, ఈ విషయం ఆయనే తనకు స్వయంగా చెప్పారని దయాకరరావు వెల్లడించారు.
లోటు బడ్జెట్ ఉన్నా అక్కడ రుణమాఫీని చెప్పిన విధంగా అమలు చేయాలని మా నాయకుడు ఆలోచిస్తున్నాడని, కేసీఆర్ లక్ష రూపాయలకు వంద కొర్రీలు పెడుతున్నాడని అన్నాడు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి రైతుల్లో ఆశ పుట్టించిన వీరు ఇప్పుడు పోటా పోటీగా రుణాలు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ, వీరు మాఫి చేస్తున్న ఇన్నివేళ కోట్లు ఏ విధంగా పూడ్చుకుంటారనేది ఆసక్తికరమైన అంశం. గతంలో కిరణ్ సర్కార్ చేసినట్లు వీరు కూడా ఆ పన్నులు, ఈ పన్నులు అని ఇచ్చిన రుణమాఫీ కంటే ఎక్కువ దోచేయరు కదా ???
Knr
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more