Income tax limit may go up to 5 lakhs

Income Tax limit may go up to 5 lakhs, New budget promises increase in IT limit, Modi Government budget gives hopes to salaries group

Income Tax limit may go up to 5 lakhs

5 లక్షల ఆదాయం వరకు పన్ను ఉండబోదు

Posted: 06/14/2014 09:34 AM IST
Income tax limit may go up to 5 lakhs

ఆదాయ పన్ను కోసం ఆదాయ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయి.  

ఇది వచ్చే నెలలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న వార్షిక బడ్జెట్ లో చోటుచేసుకున్ అవకాశం పూర్తిగా ఉందని విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం.

జీతాల మీదనే ఆధారపడేవారికి ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారికిచ్చిన వరంగా భావించవచ్చు.  దీనివలన ప్రభుత్వ ఆదాయం మీద తాత్కాలికంగా గండిపడ్డా, దీనివలన వేతనజీవులకు ఎక్కువగా ఖర్చుపెట్టుకునే అవకాశం లభిస్తుంది.  అలా వ్యయాన్ని పెంచటం వలన దేశంలో వ్యాపార రంగం ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది.  పన్ను కట్టే బదులు ఆ సొమ్ముని వినియోగించుకోవటం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందటానికి వెసులుబాటు కలుగుతుంది.

దీని వలన రాజకీయంగా ఎలాగూ మోదీ ప్రభుత్వానికి పరపతి పెరుగుతుంది.  కాబట్టి మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుని ఈ విషయంలో అభిప్రాయాన్ని తెలియజేయమని కోరినట్లుగా సమాచారం.  

ఇక ఆదాయపన్ను నుంచి సెక్షన్ 80 సి కింద ఉన్న మొత్తం, బీమాలు, పిఎఫ్ లు, పొదుపు పథకాలు ఇలా ఎందులో పెట్టుబడి పెట్టినా లక్షరూపాయలకే పరిమితమైయ్యుంది.  దీన్ని 3 లక్షల వరకు పెంచటానికి ఆర్థిక నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.  అలాగే ఆరోగ్య బీమా ప్రీమియం మీద కూడా పన్ను మినహాయింపును 5 వేల వరకు పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఎన్నికల ముందు యుపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పోలిస్తే కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రజారంజకంగా ఉంటుందని, ఎక్కువమందికి ప్రయోజనకారిగా ఉంటూనే దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా రూపుదిద్దుకుంటోందని సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more