దేశ ప్రధానిగా నరేంద్రమోదీ, సీమాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి వెళ్లలేకపోవచ్చునని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. మోడీ, పవన్ కళ్యాణ్‌తో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఎన్డియె సమావేశానికి ఆహ్వానించడం ద్వారా పవన్ కళ్యాణ్‌కు తగిన గుర్తింపు ఇచ్చినట్లు అయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మరిచిపోబోమని, గుర్తుంచుకుంటామని, తమతో పాటు పాలనలో భాగస్వామివి అవుతావని మోడీ పవన్ కళ్యాణ్‌కు చెప్పదలుచుకున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మోదీ, బాబు అమలు చేస్తారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం పవన్ మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రజలకు న్యాయం జరగలేదని అన్నారు.
సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాల్సిన అవసరంపై స్పష్టంగా చెప్పారు. భూకబ్జాలపై, వనరుల దోపిడీపై ఆయన కచ్చితంగా మాట్లాడారు. జగన్ వస్తే సీమాంధ్రకు జరిగే నష్టం గురించి ఆయన చెప్పిన మాటలు ప్రజల్లోకి చాప కింద నీరులా ప్రవహించాయి.
2004 వైఎస్ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి పరిపాలనా విధానం సరిగాలేదని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు దీర్ఘకాలంగా కొనసాగే విధంగా లేవని ఆయన విమర్శించారు. అందుకే ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) వచ్చినా కాంగ్రెస్‌కు వ్యతిరంగా ఉన్నానని పవన్ తెలిపారు. పరిశ్రమల పేరుతో దోచుకునే సంస్కృతి మంచిది కాదని ఆయన అన్నారు. గతంలో జరిగిన తప్పులే మళ్లీ జరిగితే ప్రశ్నిస్తానని పవన్ చెప్పారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెడతానని ఆయన అన్నారు. సంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తే మద్దతు ఇస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్‌ను విలువైన మిత్రుడిగా చూడదలుచుకున్నట్లు అర్థమవుతోంది. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలను తీసుకుంటామని చంద్రబాబు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఏమీ ఆశించకుండా దేశ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్‌తో పని అయిపోయిందనే రీతిలో చూసేందుకు మోడీ, చంద్రబాబు లేరు. ఈ బంధం దీర్ఘకాలం కొనసాగాలని వారు ఆశిస్తున్నారు. వచ్చే హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మంచి ఆయుధం అవుతాడనేది కూడా అర్థమవుతోంది. తాను హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికలపై దృష్టి పెడుతానని పవన్ కళ్యాణ్ అనడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
Modi and Chandra Babu treat Pawan Kalyan as a valuble friend and expressed to strengthen their relationship with Pawan Kalyan. Modi and Babu invited him for their sworn in cermonies. Pawan Kalayan expressed that he may not be able to attend these functions. Pawan said he would support Turpu Jayaprakash Reddy if he contests from BJP as MP. He also said he will focus on Hyderabad municipal elections.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more