మే 16న రాష్ట్ర భవితవ్యం తేలనుంది. విభజన అనంతరం అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో మొదటి ప్రభుత్వాన్ని చేపట్టే రాజకీయ పార్టీలు ఏమిటి?? అన్నది ఎల్లుండితో తేలనుంది. ఈ లోగా ఎగ్జిట్ పోల్స్ అంటూ.. వివిధ చానల్స్ ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తెదేపాకు పట్టం కట్టడం విశేషం. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. అది పలు పర్యాయాలు నిరూపితమైందని కూడా చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు పూర్తిగా టిడిపి వైపుకు మొగ్గు చూపాయి. జగన్ పార్టీ కనీస స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది.
గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా టిడిపి, బిజెపి కూటమి గెలుపుపై పడతుందని అంటున్నారు. పవన్ వేవ్, తమకు కలిసి వస్తుందని TDP వారు చెబుతున్నారు. అయితే బిజెపితో కలవకముందు జరిగిన స్థానిక ఫలితాల్లో టిడిపి సత్తా చాటిందని, సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ, బాబు కలిశారని, దీంతో మైనార్టీలు టిడిపికి దూరమయ్యారనే వాదన కూడా లేకపోలేదు.
పవన్ ప్రభావం: పవన్ ఇచిన నీజాయితి, నిస్వార్ధ ప్రచారం, సూటి ప్రశ్నలు, సామాన్య ప్రజల్లోని మనసులోని ఆవేదన మాటలల్ తూటాల రూపంలో పెద్ద వేవ్ శ్రుష్టించాయి. పవన్ సపోర్ట్ ప్రభావం అవినీతి మీద సూటి ప్రశ్నల వాళ్ళ చాల మంది ని మార్చి ఫైనల్ ఎలక్షన్ రిజల్ట్స్ నే ఎఫెక్ట్ చేయ్యపోతున్నాయి అని విశ్లేషణ.
పవన్ కల్యాణ్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి వచ్చానని, పదవులపై తనకు మోజు లేదని జనసేన పార్టీ అధినతే పవన్‌కల్యాణ్ స్పష్టం నిజాయితిగా గా ప్రచారం చేసారు. సామాన్యుడిగా ఉండటమే తనకు ఇష్టమని, తన స్థాయినెప్పుడూ తాను మరిచిపోలేదని ఆయన తెలిపారు. ఆజాద్, భగత్‌సింగ్ స్ఫూర్తితో పెరిగానని ఆయన చెప్పారు. వైఎస్ చేసిన దోపిడీ తనకు బాధ కల్గించిందని పవన్ అన్నారు.
వైఎస్ సంపద ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించిందని వాపోయారు. ఒకరి సంపద మరొకరిని బాధించకూడదని పవన్ హితవు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీమాంధ్రులు బానిసలుగా బతకాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఎన్డీయే అధికారంలోకి వస్తే జగన్‌ను జైల్లో పెడతామని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించిన మాట్లాడుతూ జగన్ లక్షకోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.
వైసీపీ ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల సొమ్మే అని ఆయన అన్నారు. ఓటును డబ్బుకు అమ్ముకోవద్దని ప్రజలను కోరారు. నిజాయితీగా టీడీపీకి ఓటెయ్యండి పిలుపునిచ్చారు.
సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వైసీపీ నేత జగన్ గత నాలుగేళ్లుగా ఓదార్పుయాత్రలతో కాలయాపన చేశారే తప్ప సీమాంధ్ర ప్రజలను కేసీఆర్ తిడుతుంటే ఎందుకు ప్రశ్నించలేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. గురువారం జిల్లాలో జరిగిన ఎన్డీయే కూటమి సీమాంధ్ర సింహగర్జనలో పవన్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలను కేసీఆర్ తిడుతూ వుంటే మారు మాట్లాడని జగన్‌లో సీమాంధ్ర పౌరషం చచ్చిపోయిందా అని పవన్ మండిపడ్డారు.
జగన్‌కు అవకాశమిస్తే సీమాంధ్రను మరో రెండు ముక్కలు చేస్తారని పవన్ విమర్శించారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వారు ఎట్టిపరిస్థితుల్లో సీఎం కాలేరని వ్యాఖ్యానించారు
'నూరు గొడ్లను తిన్న రాబందు కూడా గాలి వానకు కొట్టుకుపోతుందని' ఆయన హెచ్చరించారు. అలాగే ఎన్నికల్లో వైసీపీ నాయకులను తుడిచిపెట్టే అవకాశం మీ చేతుల్లో ఉందని, "YSR Congress Hataho - Seemandhra Bachao" ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి ప్రధాని కావాల్సిన మోదీని తిడితే తాటతీస్తానని పవన్ మరోసారి హెచ్చరించారు. జగన్ వల్ల అవినీతి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎన్డీయే కూటమి వల్లే సాధ్యం అవుతుందని అందుకే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబుకు మనస్పూర్తిగా మద్దతు తెలిపానని పవన్‌కల్యాణ్ వెల్లడించారు.
పవన్ వేసిన సూటి ప్రశ్నలకి YSRCP, TRS, KCR సమాధానేలే ఇవ్వని పరిస్థితి ప్రజల్ని చాల బాగా ఆలోపించ చేసాయి. పవన్‌కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపైన్ తెలుగుదేశం, బిజెపి కూటమికి కలిసి వచ్చిందని, అతని రాకతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని.. విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.
పొన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర,చిలకలూరిపేట తాజా మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు,వేమూరు తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆనంద్ లు మాట్లాడుతూ నీతికి,అవినీతికి మధ్య జరిగిన పోరాటంలో నీతిదే పై చేయి అయిందనడానికి టిడిపి గెలుపే నిదర్శనమని, గుంటూరు జిల్లాలో సహకార ఎన్నికల నుంచి ఇంతవరకు అన్ని ఎన్నికలలో ప్రజలు టిడిపిని ఆదరించారని వారు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more