Venkaiah Naidu Makes Interesting Statements On Ap Special Status | Ap Projects | AP Capital City Amaravathi

Venkaiah naidu interesting statements on special status ap projects

venkaiah naidu news, venkaiah naidu press met, venkaiah naidu press conference, venkaiah naidu special status, venkaiah naidu Latest Updates, ap special status, ap special projects, special status controversy, central government

Venkaiah Naidu Interesting Statements On Special Status AP Projects : Venkaiah Naidu Makes Interesting Statements On Ap Special Status In Nellore.

హోదా కన్నా ప్రాజెక్టులే ముఖ్యం : వెంకయ్య

Posted: 10/03/2015 07:14 PM IST
Venkaiah naidu interesting statements on special status ap projects

ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఊరించిన బీజేపీ పార్టీ.. ఇప్పుడు అధికారం వచ్చిన అనంతరం దాని ఊసే ఎత్తడం లేదు. ఇటువైపు నుంచి ఏపీ అధికార పార్టీ ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం ఇచ్చేందుకు ససెమిరా అంటోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. కొందరు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ పార్టీ నేతలు నిరసనలు, ఉద్యమాలు చేస్తున్నారు. అయితే.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం హోదా విషయమై కాస్త వెనుక్కు తగ్గింది. కానీ.. ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని ఆందోళనలు మాత్రం జరుగుతూనే వున్నాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా వెంకయ్య నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం (03-10-2015) పర్యటించిన వెంకయ్యనాయుడు.. అక్కడ రూ.3.80 కోట్లతో చేపట్టనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలోనే ‘ప్రత్యేక హోదా’ విషయంపై ఆయన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ కన్నా ప్రాజెక్టులే ముఖ్యమని పేర్కొన్నారు. తొలి ప్రాధాన్యం వాటికేనని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే కొత్త ప్రాజెక్టులు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అయితే.. ఆ క్రమంలోనే ఆయన తన తెలివిని వినియోగించుకున్నారు. ప్రాజెక్టులు వచ్చినప్పటికీ.. హోదా కోసం పోరాడదామని, ఈ అంశం నీతీ అయోగ్ పరిశీలనలో ఉందని చెప్పారు. దేశంలో ఆర్థిక స్వావలంబన సృష్టించి సంపదను ప్రజలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu news  ap special status  ap capital city amaravathi  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more