aicc vice president rahul gandhi fires on speaker sumitra mahajan | parliament of india | narendra modi

Rahul gandhi fires on speaker sumitra mahajan parliament of india

rahul gandhi, sumitra mahajan, parliament of india, sonia gandhi, bjp party, congress mps suspension, sonia controversy, rahul controversy, parliament session

rahul gandhi fires on speaker sumitra mahajan parliament of india : aicc vice president rahul gandhi fires on speaker sumitra mahajan.

ఆమె నిర్ణయాలు నచ్చలేదు : రాహుల్

Posted: 08/05/2015 05:13 PM IST
Rahul gandhi fires on speaker sumitra mahajan parliament of india

పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేసిన నేపథ్యంలో 25 మందిని ఐదు రోజులపాటు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ఇలా సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈరోజు (బుధవారం) కూడా కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఆవరణలో వున్న గాంధీ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు జేడీయూ, ఆర్జేడీ, వామపక్షాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పీకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పీకర్ సుమిత్రా మహాజన్ పై తమకెంతో గౌరవం వుందని, అయితే ఆమె తీసుకుంటున్న నిర్ణయాలను మాత్రం ఆమోదించేదిలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఆమె పూర్తి బీజేపీకి మద్దతుగానే వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయం వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధినేత్ర సోనియా మాట్లాడుతూ.. ఎంపీల సస్పెన్షన్ పై తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేతపై తమకు ఇంతవరకు ఎటువంటి సమాచారం అందలేదని ఆమె పేర్కొన్నారు. ఏదేమైనా.. ఈసారి పార్లమెంట్ సమావేశాలు చాలా వాడీవేడీగా జరుగుతున్నాయి.

మరోవైపు.. తాను కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన చర్యని సుమిత్ర తనదైన శైలిలో సమర్థించుకున్నారు. తాను చాలా సౌమ్యురాలినని, అయితే ఎంత మెతకకా వ్యవహరించే తల్లయినా కొన్నిసార్లు కఠినంగా వుండాల్సి వస్తుందని అన్నారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ప్రసంగించిన ఆమె.. పై విధంగా మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  sumitra mahajan  parliament of india  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more