Congress Senior Leader Shabbir Ali Fires On Telangana Deputy CM Mahamood Ali On Charminar Demolish

Shabbir ali fires on mahamood ali charminar demolish comments

shabbir ali, mahamood ali, congress party, trs party, taliban of telangana, trs party updates, cm kcr, osmania hospital, charminar demolish, chest hospital demolish

Shabbir Ali Fires On Mahamood Ali Charminar Demolish Comments : Congress Senior Leader Shabbir Ali Fires On Telangana Deputy CM Mahamood Ali For Commenting Charminar Demolish.

టీఆర్ఎస్.. ‘తాలిబన్ ఆఫ్ తెలంగాణ’

Posted: 08/03/2015 04:03 PM IST
Shabbir ali fires on mahamood ali charminar demolish comments

తాలిబన్లు.. ఆధిపత్యం కోసం పోరు కొనసాగిస్తున్న ఉగ్రవాదులు. ఇప్పటికే ఎందరో ప్రాణాలను బలిగొనడంతోపాటు భారీస్థాయిలో ఆస్తినష్టం కలిగించారు. ఇప్పుడు వీరిలాగే టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శిథిలావస్తకు చేరితే చార్మినార్ ని కూడా కూల్చేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పైవిధంగా మండిపడ్డారు.

ఈ క్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గతంలో ఔరంగజేలు గోల్కొండకోటపై దాడి చేసి అనేక భవనాలను కూల్చేశాడని, చార్మినార్ ని మాత్రమే వదిలిపెట్టాడని గుర్తుచేశారు. కానీ.. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాత్రం దాన్నే కూలుస్తామనడం దారుణం అన్నారు. ఏ విధంగా అయితే తాలిబన్లు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం భవనాలు కూలుస్తున్నారో.. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ కూడా సచివాలయం, చెస్ట్, ఉస్మానియా ఆసుపత్రుల భవనాల్ని కూలుస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి కొత్త నిర్వచనం చేస్తూ.. ‘టీఆర్ఎస్’ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, ‘తాలిబన్ ఆఫ్ తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా చెప్పాలంటే.. టీఆర్ఎస్ అచ్చం తాలిబన్లలాగే వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా.. వాస్తుదోషం వుండటంతో సచివాలయాన్ని ప్రస్తుతమున్న చెస్ట్ ఆసుపత్రికి మార్చాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే! అలాగే.. ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో దాన్ని కూల్చేస్తున్నారు. ఈ సందర్భంగానే పురస్కరించుకుని ఇటీవలే మహమూద్ అలీ.. అవసరమైన చార్మినార్ ని కూల్చేస్తామని పేర్కొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shabbir ali  mahamood ali  kcr  charminar demolish  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more