Ap minister prathipati pullarao fires on jagan mohan reddy | Chiranjeevi | Botsa satyanarayana | Pushkar Ghat Incident

Prathipati pullarao fires on jagan mohan reddy chiranjeevi botsa raghuveera pushkar incident

prathipati pullarao news, prathipati pullarao controversy, ap minister prathipati pullarao, jagan mohan reddy, chandrababu naidu, pushkar ghat incident, chandrababu naidu, botsa satyanarayana

prathipati pullarao fires on jagan mohan reddy chiranjeevi botsa raghuveera pushkar incident : Ap minister prathipati pullarao fires on jagan mohan reddy for making controversial comments on ap cm chandrababu naidu during pushkar ghat incident.

జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు..

Posted: 07/15/2015 01:03 PM IST
Prathipati pullarao fires on jagan mohan reddy chiranjeevi botsa raghuveera pushkar incident

ఎంతో వైభవంగా ప్రారంభమైన గోదావరి పుష్కరాల్లో భాగంగా రాజమండ్రి ఘాట్ లో మహా విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే! భక్తుల ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే అదునుగా భావించిన కొందరు విపక్ష నేతలు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలదాడి ప్రారంభించారు. ముఖ్యంగా టీడీపీ అంటేనే అంతెత్తున ఎగిసిపడే జగన్ సీఎం చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వల్లే ఆ ఘటన జరిగిందని.. ఆయన ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. బాబుపై జగన్ ఎన్నో విమర్శనాస్త్రాలు సంధించారు.

ఈ విధంగా బాబుపై జగన్ విమర్శలు చేసిన నేపథ్యంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆయనపై మండిపడ్డారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనను ఆసరాగా చేసుకొని జగన్ శవరాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అపశృతి దొర్లి భక్తులు ఇబ్బందులో పడినప్పుడు ప్రభుత్వానికి అండగా వుండాల్సిన విపక్షాలు.. రాజకీయ లబ్ది పొందేందుకు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన అన్నారు. వీలైతే భక్తుల్ని ఓదార్చాలి కానీ.. అనవసరమైన విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా ఎంతో చేసినప్పటికీ.. దురదృష్టవశాత్తు ఆ సంఘటన జరిగిందని ప్రత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగానే ఆయన చిరంజీవి, రఘువీరా, బొత్సలాంటి నేతలపై కూడా విమర్శలు గుప్పించారు. వారు ముగ్గురు ప్రభుత్వాన్ని అండగా వుంటూ, భక్తుల్ని ఓదార్చాల్సిందిపోయి.. శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prathipati pullarao  chandrababu naidu  jagan mohan reddy  pushka ghat incident  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more