Ponnala lakshmaiah controversial comments cm kcr secretariat hyderabad city vision

kcr news, kcr vision hyderabad, hyderabad city news, vision hyderabad news, kcr hyderabad city news, kcr press meet, kcr interview, kcr comments, kcr photos, cm kcr photos, ponnala lakshmaiah news, ponnala kcr news

ponnala lakshmaiah controversial comments cm kcr secretariat hyderabad city vision : tpcc ponnala lakshmaiah makes controversial comments on cm kcr that he is wasting peoples money. He is also damaging hyderabad city image.

హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీస్తున్నారు.!

Posted: 02/05/2015 05:47 PM IST
Ponnala lakshmaiah controversial comments cm kcr secretariat hyderabad city vision

తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి ఇటీవలకాలంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘విజన్ హైదరాబాద్’ పేరు ఒక ప్రాతిపదికను ప్రవేశపెట్టిన ఆయన.. ప్రజల అభిప్రాయాలను సేకరించి, వారు ఇచ్చిన సమాచారం మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం వున్న హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా వుందని, గత ప్రభుత్వాలు ఈ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని కేసీఆర్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే! ఇటీవలే ఆయన మరింతగా నిప్పులు చెరిగారు. హైదరాబాద్ పిచ్చోళ్ల సిటీ అని, ఈ నగరంలో ప్రజలకు అనుగుణంగా ఎటువంటి సౌకర్యాలు లేవని, ఇదొక చెత్త సిటీ అని వ్యాఖ్యానించారు.అంటే.. ఇప్పుడున్న హైదరాబాద్’ను మరింతగా డెవలప్ చేస్తామన్న ఉద్దేశంతో ఆయనలా చేశారు.

అయితే.. కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రత్యర్థి పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత డెవలప్ అయిన హైదరాబాద్’ను చెత్త నగరమంటూ కేసీఆర్ ఆ సిటీ ఇమేజ్’ని డ్యామేజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ పొన్నాల లక్ష్మీనారాయణ కూడా ఆయన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ..

* హైదరాబాదులో అభివృద్ధి లేదంటూ చెత్త, పిచ్చి అని చెబుతూ.. నగరం బ్రాండ్ ఇమేజ్’ని కేసీఆర్ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఎంతో డెవలప్ అయిన హైదరాబాద్ సిటీని చెత్తనగరం అనడం ఏమిటని ప్రశ్నించారు.
* ఇదివరకే హైదరాబాద్’కు బెస్ట్ సిటీ అవార్డు వచ్చిందని, ఆ అవార్డును ఆయన కుమారుడు కేటీఆర్ అందుకున్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.
* వాస్తు పేరుతో సచివాలయాన్ని ఎర్రగడ్డకు మారుస్తానంటున్న కేసీఆర్.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పనులు చేపడుతున్నారని ఆరోపించారు.
* కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే.. సంస్కృతీ, సంప్రదాయాలను కాలరాస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tpcc ponnala lakshmaiah news  cm kcr news  vision hyderabad city  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more