Dasaradhi shatakam

telugu poetry, shatakams, dasaradhhi shatakam

dasaradhi shatakam

దాశరథి శతకం-1

Posted: 02/22/2013 05:13 PM IST
Dasaradhi shatakam

దాశరథి శతకం-1

శ్రీరఘురామ చారుతులసీదలదామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధ రాక్షసవిరామ జగజ్జన కల్మషోర్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

     శతకమంటే వంద పద్యాలతో కూడిన సంపుటి అని మనందరికీ తెలిసిందే.  దాశరథి శతకం లోని మొదటి పద్యమిది.  దీన్ని రచించిన మహాభక్తుడు, రామదాసు గా ప్రసిద్ధిగాంచిన కంచర్ల గోపన్న.

     శతకాలన్నిటిలోనూ భక్తి భావన, మంచితనమనేది ఉంటుంది.  వాటికి అదనంగా దాశరథీ శతకంలోని విశేషమేమిటంటే శబ్దాలంకారం,  ఈ పద్యాలలో వాడిన పదాల కూర్పు చాలా సొంపుగా ఉంటుంది.  స్పష్టంగా చదివితే పదాల్లోంచే సంగీత మాధుర్యం కూడా లభిస్తుంది.  మిగతా శతకాలలా కాకుండా ఇందులో పద్యాలన్నీ శ్రీరాముని వర్ణనతో కూడి ఉంటాయి. 

     శ్రీరాముడంటే ఆదర్శ పురుషుడు.  ఆయనకు ఆ గుణాలున్నాయని చెప్పటమంటే, అలాంటి గుణాలను మనం కూడా సంతరించుకోవాలి సుమా అని సూచించటమే అవుతుంది.  అలా వినగా వినగా, చదవగా చదవగా,  మనసులో మననం చేసుకోగా చేసుకోగా, చివరకు మన మానసాలు కూడా రాముని గుణాలతో నిండిపోయే అవకాశం ఉంటుందన్న మనోవిఙాన సూత్రం ఆనాటి మహానుభావులకు బాగా తెలుసు.  పరమాత్ముని వర్ణించటానికి కారణం అదే.  అంతే కానీ ఆయనను పొగడ్తలతో ముంచేసి వరాలు కొట్టేయటానికి కాదు.

     శ్రీ అన్నది గౌరవప్రదమైన సంబోధన.  రఘురామ-రఘు వంశానికి చెందినవాడు,  చారు-అందమైన, తులసీదళదామ-తులసి దళాలతో అల్లిన దండను ధరించినవాడు, శమ-శాంతము, క్షమ-ఓర్పు, సహనం, ఆది-మొదలైన, గుణ-గుణాలచేత, అభిరామ-మనోహర రూపుడు, త్రిజగత్- మూడు లోకాలలోనూ, నుత- పొగడదగిన వాడు, శౌర్యరమా- పరాక్రమ లక్ష్మికి, లలామ- నగ, ఆభరణమువంటి వాడు, దుర్వార- ఆపలేని, కబంధ రాక్షస విరామ- కబంధుడనే రాక్షసుని వధించినవాడు, జగజ్జన- ప్రపంచంలోని మనుషులలోని, కల్మష- పాపాలనే, ఆర్ణవ-సముద్రాన్ని, ఉత్తారక- దాటించగలిగినవాడు, నామ- పేరుగాంచినవాడు, కరుణాపయోనిధీ- దయాసముద్రుడా, భద్రగిరి-భద్రాచలంలో ఉన్న దాశరథీ- దశరథుని కుమారుడైన రామా,

     రఘువంశమున పుట్టినవాడవు, అందమైన తులసిమాలను ధరించినవాడవు, శాంతి సహనాలనే గొప్ప గుణాలు కలిగి రాణించినవాడవు, పరాక్రమంలో మూడులోకాల్లోనూ పొగడదగినవాడవు, అలవికాని కబంధుడనే రాక్షసుడిని వధించినవాడవు, సమస్త జనులను పాపాలనే సముద్రాన్ని దాటించగలవాడ వనే పేరుగాంచినవాడవు, దయా సముద్రుడవు, భద్రాచలంలో కొలువున్న ఓ శ్రీరామా.

     రాముడిని సకలగుణ రాముడంటారు.  ఒక మనిషి ఎన్ని సుగుణాలతో ఉండాలో అన్నీ సంపూర్ణంగా ఉన్న వాడే రాముడు.  శాంతి, సహనం ఉండబట్టే, ఎవరైనా ఎదుట పడి నిందించినా చలించేవాడు కాదు.  ఈ కాలంలో ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటామా.  మనం కూడా గట్టిగా అరిచి ఎదుటివాడిని తిట్టిపోయమూ.  మనకు అందవలసిన మర్యాద అందకపోతేనే కోపం వచ్చేస్తుంది అలాంటిది ఎవరైనా మనల్ని ఏమైనా అంటే ఊరుకుంటామా.  కానీ రాముడు అలా కాదు.  ఎవరైనా ఆయన గురించి ఏమైనా అంటే, వాళ్ళకి తన గురించి తెలియదు కాబట్టి అని అనుకుని శాంతంగా ఉండేవాడు.  ఎందుకంటే తన గురించి తనకు బాగా తెలుసు కాబట్టి.  ఎవరో ఎదురు పడి గాడిదా అని తిట్టినంత మాత్రం చేత మనిషి గాడిద అయిపోతాడా.  అలా అన్నవాడిలోని అవగాహనా రాహిత్యమది.  అక్కడే శాంతం సహనం పనికివస్తుంది.  సమాజంలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే మనుషులంతా సహనశీలాన్ని కలిగివుండాలి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Dasarathi satakam

  దాశరథి శతకం

  Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more

 • Dasarathi satakam

  దాశరథీ శతకము

  Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more

 • Dasarathi satakam

  దాశరథీ శతకము

  Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more

 • Dasarathi satakam

  దాశరథీ శతకము

  Apr 12 | గురుతరమైన కావ్యరస  గుంభనకబ్బురమంది ముష్కరుల్  సరసులమాడ్కి, సంతసిల  జాలుదురోటు శశాంక చంద్రికాం  కురముల కిందు కాంతమణి  కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more

 • Dasarathi satakam in telugu

  దాశరథీ శతకము

  Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి   సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి  తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల  బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more