Kabir das quotes

kabir das quotes, rabindranath tagore quotes, gandhi quotes, paramahamsa yogananda quotes

kabir das quotes

కబీర్ దాస్ సూక్తి

Posted: 04/27/2013 03:53 PM IST
Kabir das quotes

వ్యామోహమున్న చోట ప్రేమ ఎలావుంటుంది
ప్రేమ ఉన్న చోట వ్యామోహానికి తావే లేదు - కబీర్ దాస్.

ఈ కాలంలో ప్రేమకు, అవసరానికి, వ్యామోహానికి,  తేడా తెలియకుండా పోయింది.   మనకు అవసరానికి ఉపయోగపడేవారిని మన స్నేహితులని, మిగిలినవారిని కారని అనుకుంటున్నాం.  మనకు అనుకూలంగా ఉండేవారిని మిత్రులని, అలా లేనివారిని శత్రువులని భావిస్తున్నాం.  వ్యామోహాన్నే ప్రేమ అని అనుకుంటున్నాం. 

ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవటాలు కూడా లేవు.  నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వూ నన్ను ప్రేమించు, లేదంటే నీ మీద యాసిడ్ పోస్తా అనేది ప్రేమ ఎలా అవుతుంది.

గిచ్చి బాధపెట్టి అదే ప్రేమ అనుకుంటే ఎంత పొరపాటు.  ప్రేమ ఉన్నచోట బాధకు తావు లేదు.  నాకు దక్కలేదు అనే బాధ ఉంటే అది ప్రేమ అనిపించుకోదు.  ప్రేమ అంటే త్యాగమని కూడా కాదు.  వ్యామోహం కానప్పుడు త్యాగం కూడా కాదు.  ప్రేమ ఎవరి మీద ఉంటుందో వారి ఆనందాన్ని కోరుకోవటమే ప్రేమ, వారు తనకి ఆనందాన్ని ఇవ్వాలనుకోవటం వ్యామోహం.  తను ఇష్టపడ్డవారిని సంతోషపెట్టాలనుకునేది  ప్రేమ, తన ఇష్టానికి తగ్గట్టుగా ఇతరులు ప్రవర్తించాలనుకునేది వ్యామోహం.  అందువలన రెండూ ఒక దగ్గర ఉండటానికి అవకాశం లేదు.  అందుకే, ప్రేమ ఉన్నచోట వ్యామోహం లేదు, వ్యామోహం ఉన్న చోట ప్రేమ లేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more