Highlights of 1 nenokkadine audio

highlights of 1 nenokkadine audio, 1 nenokkadine, mahesh 1 nenokkadine, 1 nenokkadine movie, 1 nenokkadine audio launch highlights, tollywood news, movie news, film news, cinema news, 1-Nenokkadine Audio, 1-Nenokkadine Audio Launch,1-Nenokkadine audio photos,Nenokkadine stills,Mahesh Babu 1 Nenokkadine Movie

highlights of 1 nenokkadine audio, 1 nenokkadine, mahesh 1 nenokkadine, 1 nenokkadine movie, 1 nenokkadine audio launch highlights, tollywood news, movie news, film news, cinema news, 1-Nenokkadine Audio, 1-Nenokkadine Audio Launch,1-Nenokkadine audio photos,Nenokkadine stills,Mahesh Babu 1 Nenokkadine Movie

1-నేనొక్కడినే ఆడియో హైలెట్స్

Posted: 12/20/2013 09:45 AM IST
Highlights of 1 nenokkadine audio

సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘1’ సినిమా ఆడియో నిన్న రాత్రి శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా సాగింది. రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. కృతి సనన్ కథానాయిక. కన్నుల పండగగా జరిగిన ఈ ఆడియో వేడుకలో తొలి సీడీని మహేష్ బాబు తనయుడు గౌతమ్‌కృష్ణ ఆడియో సీడీని ఆవిష్కరించి దర్శకుడు శీనువైట్లకు అందించాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ... చాలాకాలంగా దేవిశ్రీ, నేనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాం.

సుకుమార్ కారణంగా మా కలయిక కుదిరింది. దర్శకుడిగా సుకుమార్ ఆలోచనలకు హ్యాట్సాఫ్. గోవాలో షూటింగు జరుగుతున్నప్పుడు ఓ కాఫీ షాపులో సుకుమార్ నన్ను కలిసి కథ వినిపించారు. టెన్షన్ లో సరిగ్గా వినలేదు. కానీ అరగంట తరువాత నేనే ఫోన్ చేసి కథ సూపర్బ్ అన్నాను. మూడేళ్లు ఈ సినిమాకోసం ఆయన పడ్డ కష్టం కళ్లతో దగ్గరుండి చూశానని అన్నారు. అభిమానులను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడిన మహేష్ నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని... అభిమానంతో ఆదరిస్తున్న మీ రుణం తీర్చుకోలేనిది.ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను. చేతులెత్తి నమస్కరించడం తప్ప ’’ అని అనడంతో అక్కడున్నవారు పొంగిపోయారు. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. నా కంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్. ఏదిఏమైనా ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

టోటల్‌గా నా కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఇక ఇన్ని రోజులు డాన్స్ లు సరిగా వేయలేననే ఫీలింగ్ ఈ సినిమాతో పొతుందని అన్నారు. సూపర్ స్టార్ క్రిష్ణ మాట్లాడుతూ... నన్ను, మా అబ్బాయి మహేష్ ని ఆదరించినట్లుగానే గౌతమ్ ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాను కష్టపడి తీసిన టీంకి నా అభినందనలు. విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా, విడుదల తరువాత మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ... మహేష్‌కి స్విమ్మింగ్ రాదు. కానీ... సముద్రంలో ఎంతో అనుభవం ఉన్నవాడిలా స్కై డైవింగ్ చేసేశారు. ఆయనలోని తెగువ చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని. కెమెరాలోంచి ఏ కోణంలో చూసినా అందంగా ఉంటారు మహేష్.

ఆయన 360 డిగ్రీల అందగాడు. ఆయన అందం చూసి అనిపించింది. హీ ఈజ్ ‘1’ అని ఆకాశానికెత్తేశారు. ఈ చిత్రం ఇంత టైం తీసుకోవడానికి కారణం నేను కాదు...ఆయనే. చిత్రం చిత్రీకణ తొందరగా పూర్తయితే ఆయన్ను చూడటం కష్టం కాబట్టి ఇంత లేట్ చేశానని చెప్పుకొచ్చారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, సూపర్‌స్టార్ కృష్ణ, జి.ఆదిశేషగిరిరావు, నమ్రత, బోయపాటి శ్రీను, సుధీర్‌బాబు, లహరి మ్యూజిక్ మనోహర్‌నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో కోలాహాలంగా సాగింది.

Mahesh 1 Nenokkadine Audio Launch Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more