తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశం రోజుకో మలులు తిరుగుతూ.. ఏ పార్టీ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో అర్ధం కావడం లేదు. నిన్నటివరకు రెండు ప్రాంతాలకు సమన్యాయం చేసి విభజన చేయాలని నినాదం చేసిన తెలుగుదేశం పార్టీ నినాదాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అందుకున్నట్లు కనిపిస్తుంది. బిజేపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటన ఇప్పుడు తెలంగాణా అంశంలో కొత్త ట్విస్ట్ గా మారింది. రాజనాధ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడమే కాదు, అవిశ్వాసంలో కూడా నెగ్గుతామని.. దీనికి కారణం సీమాంద్రుల సమస్యలు పరిష్కరించకుంటే తాము ఊరుకోమని రాజ్ నాథ్ చెప్పారు. తమకు తెలంగాణ ఏర్పాటు ఎంత ముఖ్యమో, సీమాంద్రుల సమస్యల పరిష్కారం కూడా తమకు అంతే ముఖ్యమన్నారు. దీంతో బిజేపి తటస్థంగా మారిందని ఇది తమకే అనుకూలిస్తుందని సీమాంద్రనేతలు భావిస్తున్నారు.
ఏకోణంలో చూసినా ఇప్పుడు జరుగుతున్న విభజనతో సీమాంద్రకు న్యాయం జరగడం లేదని.. సీమాంధ్ర నేతలకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా లేదని.. వాళ్ళకు న్యాయం జరగకపోతే తెలంగాణ బిల్లును బిజేపి అడ్డుకుంటుందని చెప్పారు. ఇక రాజనాధ్ తాజా వ్యాఖ్యలు చేస్తుంటే బిజేపీ టిడిపితో పొత్తుకు మొగ్గు చూపుతోంది అన్నది దాదాపుగా తెలిసిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కూడా సీమాంద్రవైపు మొగ్గు చూపుతున్న ఈ సమయంలో బిజేపీ రెండు ప్రాంతాల న్యాయం అనే సిద్దాంతాన్ని అందుకోవడం ఆసక్తికరంగా మారింది! చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ వైపు వడివడిగా అడుగులేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో బిజేపీతో టిడిపి పొత్తు తప్పదా? బిజేపీ అగ్ర నేతలు సైతం బాబుకు అనుకూలంగానే ఉన్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిణామాలను చూస్తుంటే. ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో టిడిపి-బిజేపీల సంబంధాలు మరికాస్త బలపడినట్లుగా కనిపిస్తుంది.
బీజేపీ ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.బిజేపీ అగ్రనేతలతో కలసిఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన అనంతరం బిజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రానున్న సాధారణ ఎన్నికల ముందు కానీ.. ఎన్నికల తర్వాత కానీ టిడిపి బిజేపీతో జతకట్టనుంది అనే వార్తల నేపథ్యంలో..ఈ భేటీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పటికే పొత్తు ఖరారైందని, త్వరలోనే చంద్రబాబును ఎన్డీయే కన్వీనర్ గా కూడా నియమించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుండగా ఈ భేటి కీలకంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more