గత తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలకు ఓటర్లు తగిన బుద్ది చెప్పారు. అధిక ధరల పెరుగుదల, అవినీతి, అసమర్థ రాజకీయాల వలన కాంగ్రెస్ పార్టీకి కోలుకోని దెబ్బతగిలింది. తర్వలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీ వికసించగా అధికార కాంగ్రెస్ పార్టీ జాడ పత్తా లేకుండా కొట్టుకొని పోయింది. ఊహించిన ఫలితాతే వచ్చినా.. అందరిని ఖంగుతినే ఫలితాలు రావడంతో యావత్ దేశం ఒక్కసారిగా ఖంగుతిన్నది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అవి కాస్త చేజార్చుకుంది. నాలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకోగా, రాజస్థాన్ లో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించింది. ఢిల్లీలో గెలిచినా కానీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం లేకుండా పోయింది. ఏడాది కిందటే పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధానిలో కాంగ్రెస్‌ను చావు దెబ్బతీసి, బీజేపీని అధికార పీఠానికి ఆమడ దూరంలో నిలిపేసి.. అందరినీ ఖంగు తినిపించింది. ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన తొలి ఎన్నికలోనే.. మూడు పర్యాయాల ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని స్థితిలో ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ నెలకొంది.
దేశ రాజధాని నగరంలో పదిహేనేళ్ల కాంగ్రెస్ అవినీతి పాలనకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చరమగీతం పాడి , అవినీతి రాజకీయాల్ని ప్రజలు సహించరని నిరూపించాడు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్‌ను న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓడించాడు. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో అధికార కాంగ్రెస్ కేవలం 8 సీట్లకే పరిమితమై మూడో స్థానానికి పడిపోయింది. కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ తొలి ఎన్నికల్లోనే 28 సీట్లు గెలుచుకుని రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది
ఐదేళ్ల కిందట వసుంధర రాజె నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి.. రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆమె చేతిలోనే చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 సీట్లకు ఎన్నికలు జరగగా.. ప్రతిపక్ష బీజేపీ 162 సీట్లు గెలుచుకుని నాలుగింట మూడు వంతుల మెజారిటీ సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. బీజేపీ బలం 78 నుంచి 162కు పెరగగా, 96 స్థానాలున్న కాంగ్రెస్ ఏకంగా 75 సీట్లను కోల్పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. రాజస్థాన్ లో గెలుపు మోడీ మాయే అని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో అధికార బీజేపీ 165 సీట్లు గెలుచుకుని మూడింట రెండొంతుల మెజారిటీ సాధించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 58 సీట్లు కూడా దక్కలేదు. బీజేపీ బలం 143 నుంచి 165కు పెరిగితే.. కాంగ్రెస్ బలం 71 నుంచి 58కి పడిపోయింది. చౌహాన్ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
చత్తీస్ ఘడ్ లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూసిన కాంగ్రెస్ కి అది కూడా దక్కలేదు. మొత్తం 90 సీట్లలో బీజేపీ 49 సీట్లు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 39 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి ఒక స్థానం తగ్గగా, కాంగ్రెస్‌కు ఒక స్థానం పెరిగింది. రమణ్‌సింగ్ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందో అనే దాని పై ఆందోళన చెందుతున్నారు ఆ పార్టీ నేతలు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more