సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మనదేశ ఆర్థిక నగరంగా చెప్పుకుంటున్న ముంబయి పై భయంకరమైన దాడి. నగరం నడి బొడ్డున ఉన్న తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ , కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్, ట్రైడెంట్ ఒబెరాయ్, నారిమాన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ లలో పై పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు భీకర దాడి చేసి నేటికి ఐదేళ్ళు పూర్తయ్యాయి.
ఆ రోజు పాకిస్థాన్‌కు చెందిన పది మంది సాయుధ ఉగ్రవాదులు ఎటువంటి భద్రత లేని అరేబియా సముద్రమార్గం మీదుగా నగరంలోకి చొరబడి సృష్టించిన నరమేధానికి 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన కాల్పుల అలజడిలో ఏ సమయంలోనైనా దాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చినా భద్రతా బలగాలు పట్టించుకోకపోవడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటనపై జాతి యావత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమెరికాలో జరిగిన సంఘటన తరువాత అంత స్థాయిలో ఉగ్రవాదులు తెగబడ్డ సంఘటన ఇదే కావడంతో ముంబై నగరం ఒక్కసారి ఉలిక్కి పడింది.
ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటన నేటికి ముంబై ప్రజల కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ రోజు సంఘటన తరువాత ముంబై నగరం కోలుకోవడానికి కొన్ని రోజులే పట్టింది. ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేసిన ఈ భారీ ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు భరోసానిచ్చేందుకు వివిధ ఫోర్స్‌లను ఏర్పాటుచేసింది. ఉగ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు ఫోర్స్ వన్‌ను సృష్టించారు. ముంబైపై ముష్కరుల దాడి తర్వాత పోలీసు శాఖను పూర్తిగా ఆధునీకరించారు. మెరుగైన ఆయుధాలు, వాహనాలు అందించారు. సమాచార వ్యవస్థను పటిష్టపరిచింది.
ప్రజల భద్రత కోసం సకల సౌకర్యాలను కల్పించారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావ్రుతం కాకుండా ఉండి, ముంబై ప్రజలు నిర్భయంగా జీవనాన్ని కొనసాగించేందుకు పోలీసు వ్యవస్థతో పాటు సర్కార్ భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవల్సిన అవసరముందనే అభిప్రాయాన్ని పలువురు చేస్తున్నారు. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ....
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more