టాలీవుడ్ బడా నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరు చిన్నగా దానికి అలవాటుపడుతున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాను నిర్మించాలంటే.. భారీ బడ్జెట్ అవసరమవుతోంది. సరిగ్గా సినిమా తీశాక అది కాస్త బోల్తా కొట్టిందనుకో.. నిర్మాత పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఈ సాంప్రదాయానికి మన టాలీవుడ్ నిర్మాతలు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు.
భారీ బడ్జెట్ సినిమాలను ఒక్క నిర్మాతే తీయకుండా.. పలువురు నిర్మాణ ప్రొడక్షన్ సంస్థలన్నీ కలిసి సినిమాను తీస్తున్నారు. కొన్ని పెద్ద బడ్జెట్ సినిమాలకు ఇద్దరు ముగ్గురు నిర్మిస్తున్నారు. అది చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ మూవీ అయినా నిర్మాతలు తలా కొంత బడ్జెట్ పంచుకుంటున్నారు.
దీనిలో భాగంగానే.. ఈ నెల 14న విడుదల కాబోతున్న 'మసాలా' చిత్రాన్ని 'సురేష్ బాబు', 'స్రవంతి రవికిశోర్' నిర్మిస్తున్నారు. అలాగే 'అల్లు అర్జున్ రేసుగుర్రం'కు నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఇక బాలకృష్ణ 'లెజెండ్' మూవీని '14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్', 'వారహి చలన చిత్ర'లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ ' పిల్లా నువ్వులేని జీవితం' కు కూడా ఇద్దరు నిర్మాతలున్నారు. ఇక మరో వైపు ఏ పెద్ద సినిమాకైనా రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కూడా భాగస్వామిగా మారుతోంది.
ఇలా ఒకే సినిమాకు ఇద్దరు నిర్మాతలు ఉండటం ద్వారా ఆయా సినిమాల నిర్మాణ వ్యయాన్ని పంచుకోవడంతో పాటు... ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అలాగే సినిమా ఫ్లాప్ అయి.. నష్టాలొచ్చినా.. తక్కవలో బయటపడతారు. అందుకే ఇప్పుడు కొందరు పెద్ద నిర్మాతలు కూడా చిన్న బడ్జెట్ లు పెట్టి పెద్ద సినిమాలే తీసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో రోజు రోజుకూ జాయింట్ సినిమాలు పెరిగిపోతున్నాయి. సో.. టాలీవుడ్ లో మంచి పరిణామాలే స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more