ప్రముఖ సినీ హాస్య నటుడు ఏవీఎస్ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబధిత వ్యాధితో భాధపడుతున్న ఆయనను పదిరోజుల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కాలేయానికి ఇన్ ఫెక్షన్ సోకడంతో చికిత్స చేయలేమని, పరిస్ధితి చేయి దాటిపోయిందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఈరోజు ఆయనను వెంటిలేషన్ పైనే ఇంటికి తీసుకెళ్లారు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆయన తన కుమారుని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎవీఎస్ కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆయన పలు పాత్రలలో ప్రేక్షకులను అలరింపజేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భాంతిని వెలిబుచ్చారు.
ఏవీఎస్..
అమంచి వెంకట సుబ్రమణ్యం గా పిలవబడే.. 'ఏవీఎస్' 1957జనవరి 2న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాడు. దాదాపు 500పైగా సినిమాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రపంచంలో హాస్య నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రచయితగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు ఏవీఎస్ పాత్రికేయుడిగా కూడా పనిచేశాడు. అంతేకాదు కొద్ది కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో కూడా కొద్దికాలం క్రియాశీలంగా వ్యవహరించారు. తెలుగు చిత్ర సీమలో మొదట చిన్న చిన్న వేషాలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక నట శైలిని ఏర్పరుచుకున్నాడు.
సినీ జీవితం..
ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. తుత్తి అనే పదం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం లాంటి ప్రముఖ హస్య నటులతో సమానంగా ఏవీఎస్ రాణించారు. ఆయన నటించిన తొలి చిత్రం 'మిస్టర్ పెళ్లాం' లో ఉత్తమ ప్రదర్శనకు నంది అవార్డు లభించింది. హస్య నటుడే కాక, దర్శకుడిగా పనిచేశారు.
ఆ చిత్రంతోనే తొలిసారి నంది అవార్డు గెలుచుకున్నాడు. దాదాపు 20ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు ఆయన 500పైగా సినిమాల్లో నటించాడు. ''శివమణి, గంగోత్రి, వెంకీ, శివశంకర్, సంకాంత్రి, జై చిరంజీవ, శ్రీరామదాసు, మహానంది, బంగారం, మధుమాసం, కింగ్, బెండు అప్పారావు, శుభప్రదం, దేనికైనా రెడీ, ప్రవిత్ర'' వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా ఈ శుక్రవారం విడుదలయిన 'నేనేం చిన్న పిల్లనా' అనే చిత్రంలో కూడా హాస్య పాత్రలో నటించి అలరించాడు.
'బ్లాగ్ బాస్టర్ అవార్డు' పేరుతో ఓ అవార్డును కూడా స్థాపించాడు. 'ఓరి నీ ప్రేమా బంగారం కాను' చిత్రంతో దర్శకుడిగా మారి నాలుగు సినిమాలను రూపొందించారు. నిర్మాతగా మారి 'అంకుల్' సినిమాను నిర్మించాడు. ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు చిత్రసీమ ప్రముఖ హాస్యనటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more