Seemandhra union ministers nod for package

seemandhra union ministers nod for package, Telangana,smaikyandhra,seemandhra central ministers,package,Seemandhra,Central ministers,Telangana,Deside,Package

seemandhra union ministers nod for package, Telangana,smaikyandhra,seemandhra central ministers,package,Seemandhra,Central ministers,Telangana,Deside,Package

సీమాంధ్ర వద్దు.... ప్యాకేజే ముద్దు .?

Posted: 11/06/2013 08:50 AM IST
Seemandhra union ministers nod for package

తెలంగాణ విభజన ప్రకటన తరువాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర, రాష్ట మంత్రులు ఎంతో ఆవేశంగా రాజీనామాలు చేసి మేం తెలంగాణకు వ్యతిరేకులం అని చాటి చెప్పుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ళు కూడా తన అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ప్రజల్ని కూడా మభ్యపెడుతూ సాధ్యమైనంత వరకు తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటామని చెప్పుకొచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల పోరాటం అంతా ఉత్తిదే అని తేలిపోయింది.

ఇన్నాళ్ళు సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తూ రాజీనామాలు చేస్తున్నామంటూ సమైక్యఉద్యమం చేసిన కేంద్ర మంత్రలు ఇప్పుడు తెలంగాణ విభజనకు అనుకూలంగా వెళ్లాలని, తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చి సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మంగళ వారం రాత్రి కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఇంట్లో సమావేశమైన సీమాంద్రకేంద్ర మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర విభజనకు బహిరంగంగా అంగీకారం తెలపాలని మంత్రులు కావూరి సాంబశివరావు, ఎంఎం పల్లంరాజు, పనబాక లక్ష్మి, డి.పురందేశ్వరి, కిల్లికృపారాణి నిర్ణయించారు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడమే తరువాయి. సీమాంధ్రకు భారీగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, నిధులు, పన్నుల మినహాయింపు, ఉపాధి కల్పన ప్రాజెక్టులు తదితరాలు ఇవ్వాలంటూ వినతిపత్రం రూపొందించాలని నిర్ణయించినట్లు మనకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు భారీ ప్యాకేజీ డిమాండ్ చేసి ప్రజల్ని చల్లబరచాలని డిసైడ్ అయ్యారు.

సీమాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ కోరుతూ... జాబితాను తయారు చేయాలని ఇదే జాబితాను నేడు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి అందజేయనున్నామని. రేపు జరగబోయే జీఎంఓకు సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించనున్నట్లు ఈ సమావేశం అనంతరం పనబాక లక్ష్మి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాడతామని నమ్మబలికిన ఈ నాయకుల్ని ప్రజలు క్షమిస్తారంటారా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more