Chandrababu fire on cm kiran with heavy flood

chandrababu fire on cm kiran with heavy flood , chandrababu naidu new demand to cm kiran , cm kiran kumar reddy, state Heavy flood, heavy rain, farmers, heavy flood water in houses,

chandrababu fire on cm kiran with heavy flood

భారీ వర్షం-కిరణకు బాబు కొత్త డిమాండ్

Posted: 10/25/2013 05:51 PM IST
Chandrababu fire on cm kiran with heavy flood

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షం పై .. చంద్రబాబు మండిపడ్డారు. అంటే వర్షం మీద కాదులేండి.. కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. భారీ వర్షాలకు మార్కెట్ యాడ్ లలో తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వాలు సహాయం అందించడం లేదని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయన పార్టీ కార్యాలయంలో ఈరోజు మాట్లాడారు వర్షానికి పాడైపోయిన పత్తి, మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు వరద బారిన పడి కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ నెల ఆరునుంచి రచ్చబండ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుండడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ప్రజలకు సహాయ చర్యలను నామమాత్రంగా అందిస్తోందని అన్నారు. కృష్ణా జిల్లా వరదల్లో 1000 కోట్ల సహాయం అందిస్తామని ప్రకటించిన కేంద్రం 50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. నీలం తుపాను బాధితులకు సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వెంటనే నష్ట నివారణ పద్దతులను చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

వరద సహాయక ప్రాంతాల్లో ప్రజలకు ఆహారపదార్థాలను, మంచినీరు అందించే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హెక్టారుకు 25 వేలు రైతులు సహాయం అడగగా 10 వేలు మాత్రమే ఇచ్చారని, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్షత చూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం ఓట్లతో గెలిచి ఇప్పుడు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. సహాయ కార్యక్రమాల్లో భాగంగా ఎన్ టిఆర్ ట్రస్ట్ భవన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more