రాష్ట్రం పై ఫై-లిన్ తుపాన్ బీభత్సం గురించి తెలిసిందే. ఈ ఫై-లిన్ తుపాన్ దెబ్బ రైతులు, మత్య్సకారులు, భారీగా నష్టపోయారు. అయితే మన రాజకీయా నాయకులకు ఫై-లిన్ తుపాన్ కలిసి వచ్చింది. 75 రోజులుగా సమైక్యాంద్ర కోసం ఉద్యమం చేస్తూ, రాజకీయ నాయకులను రాజీనామాలు చేయ్యమని సీమాంద్ర ప్రజలు ఒత్తిడి పెంచినప్పటికి బయటకు రాని రాజకీయ నాయకులకు ఫై-లిన్ తుపాన్ బాగా కలిసి వచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ఒక్క రోజు కూడా పాలుపంచుకోని రాజకీయ నాయకలు, సీమాంద్ర ప్రజల ముందుకే రావటానికే భయపడిన మన రాజకీయ నాయకులు.. ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఫై-లిన్ తుపాన్ పేరుతో ప్రజల ముందుకు మన రాజకీయ నాయకులు వస్తున్నారు. తమ రాజీనామాల పై, రాష్ట్ర విభజన పై స్వరం మార్చుతున్నారు. సీమాంద్ర ప్రజల ముందు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రుల స్వరంలో మార్పు వస్తోంది. రాజీనామాలపై రాజీపడుతున్నారు. నెమ్మదిగా రూటు మార్చుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు ఆగదనే వాస్తవాన్ని తాము జీర్ణించుకుంటూ, దాన్నే ప్రజలకు నమ్మించి ఒప్పించే దిశగా అడుగులేస్తున్నారు.
రాష్ట్ర విభజన తిరుగులేని వాస్తవమని, దాన్ని అంగీక రించడానికి అందరూ సిద్ధపడాలని, సీమాంధ్రకు రావా ల్సిన పరిహారాల్ని, సదుపాయాల్ని, నిధుల్ని, వనరుల్ని పోరాడి సాధించుకోవడమే ఉత్తమమని కేంద్రమంత్రి పురందేశ్వరి ప్రకటించడంతో వారి రాజీనామాలు ఇక లేనట్లేనని తెలుస్తోంది. మరోమంత్రి పనబాక లక్ష్మి సైతం బాహాటంగానే ఢిల్లిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొ న్నారు. విభజన ప్రకటన వెలువడిన తరవాత తమ నియో జకవర్గాలకు దూరంగా ఉన్న కేంద్రమంత్రులు నెమ్మదిగా జనంలోకి వస్తున్నారు. కిల్లి కృపారాణి సొంతజిల్లా శ్రీకాకుళంలో తుపాను కార్యక్రమంలో కేంద్రమంత్రి హోదాలో పాల్గొన్నారు. తాను మొదటి నుంచి సమైక్య వాదినని పేర్కొంటూనే, తన రాజీనామా వల్ల విభజన ప్రక్రియ ఆగదని, అందుకే రాజీనామా చేయడం లేదంటూ విస్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ ప్రక్రియ ఆగదని తేల్చి చెప్పారు. మరో కేంద్రమంత్రి పళ్లంరాజు సైతం సొంతజిల్లాకు చేరుకొని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన పై-లీన్ సైతం కేంద్రమంత్రులకు మార్గాన్ని సుగమమం చేసింది. కేంద్రమంత్రులు పళ్లంరాజు, కిల్లికృపారాణి, శత్రుచర్ల సొంతజిల్లాల్లో తుపాను సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇప్పుడు మంత్రులందరూ దాదాపు ఒకే కోరస్ వినిపిస్తున్నారు. సమైక్యరాష్ట్రం మినహా మరో ప్రత్యా మ్నాయం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించిన మంత్రులు... రాష్ట్రంలో వేగంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా రాజీనామాల అంశంలో మెత్తబడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్ని నిరసనలు చేపట్టినా, 75 రోజుల పాటు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినా, కంటితుడుపుగా ఆంటోని కమిటిని తర్వాత మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడం మినహా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం మెత్తబడకపోవడంతో, రాజీనామాలు చేసినా లాభం లేదని కేంద్రమంత్రులు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అంశంలో తలెత్తే వివాదాల్ని పరిష్కరించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిందని, వారు రాష్ట్ర పర్యటనకు వచ్చి తమ నిర్ణయాన్ని వెల్లడించే వరకు వేచి చూసే ధోరణి అవలంభించాలని కోస్తాంధ్ర మంత్రులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదనే సంకేతాలు తమకు స్పష్టంగా అందుతున్నాయని కోస్తాంధ్రమంత్రులు సన్నిహిత వర్గాలతో చెబుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామాల విషయంలో దూకుడు తగ్గించాలని కేంద్రమంత్రులు తమలో తాము నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామాల విషయంలో తమ వైఖరిని సడిలించుకోవడానికి రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులూ కారణమవుతున్నాయని పలువురు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉద్యోగసంఘాలతో జరిపిన చర్చలు సఫలం కావడం, విద్యుత్, రవాణ తదితర శాఖల ఉద్యోగులు విధుల్లోకి చేరడం వంటి పరిణామాలు కూడా కేంద్రమంత్రుల రాజీనామాల వ్యవహారంలో మార్పుకు కలిసొచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more