రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజన పై చాలా తొందరపడుతున్నారు. ఎంత త్వరగా రాష్ట్ర విభజన జరిగితే అంత మంచిదనే విధంగా దిగ్వజయ్ వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ నుండి .. ఆంద్రప్రదేశ్ రాజకీయాలను మార్చుతున్నారు. రోజుకోక రకంగా.. మీడియా ముందు రకరకాల ప్రకటనలు చేస్తూ .. ఆంద్రప్రదేశ్ ప్రజలను, రాజకీయ నాయకులను, అయోమయంలోకి నెట్టేస్తున్నాడు. ఒకరోజు తెలంగాణ నోట్ గురించి నాకేం తెలియదంటారు, మరో రోజు రాష్ట్ర విభజనపై మేము వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నాడు. మరోసారి.. సీమాంద్ర ప్రజలకు న్యాయం చేస్తాం. ఆంద్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన వస్తుందని, లేదా కేంద్రం చూసుకుంటుందని, ఆయన ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు. అంతే కాకుండా .. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసి, సీఎం ఒక సమైక్యవాది, ఆయన తెలంగాణ రావటం ఇష్టంలేదని చెబుతాడు. ఈరోజు తెలంగాణ కోసం సీఎం కిరణ్ పోరాటం చేసాడని చెబుతున్నాడు.
అసలు దిగ్విజయ్ సింగ్ చేసే ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం ఇప్పటికే జరిగిపోయింది. అయితే ఈరోజు మరో కొత్త ప్రకటనతో మీడియా ముందు వచ్చాడు. ఈ సారి సిఎం కిరణ్ , చంద్రబాబు, జగన్ ను టార్గెట్ చేసుకున్నాడు. అయితే ముఖ్యంగా.. సిఎం కిరణ్ పైనే ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సమైక్య వాడిగా ముద్ర ఉన్న కిరణ్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని చెప్పాడని ఇప్పుడు కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైకాపాల తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చిన లేఖలను బయటపెట్టిన డిగ్గీ ఇప్పుడు కిరణ్ ను టార్గెట్ చేసినట్లుగా ఉంది. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని, వాటి ఆధారంగానే తాము తెలంగాణాపై ముందడుగు వేశామని, ఇప్పడు వైఖరి మార్చుకోవడం తగదని చెబుతూ వచ్చిన దిగ్విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ గురించి కూడా మాట్లాడడం ఆరంభించారు.
తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అప్పుడు కిరణ్ అన్నారని, అయితే పార్టీ నిర్ణయానికి మాత్రం అందరం కట్టుబడి ఉంటామని చెప్పారని డిగ్గీ పేర్కొన్నారు. అంటే కిరణ్ రెడ్డి కూడా ఒకే అని అప్పుడే చెప్పారని డిగ్గీ అంటున్నట్లుగా ఉంది. అయితే తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే లేఖకే కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదని అయితే సీమాంధ్ర సమస్యలు పరిష్కరించిన తర్వాతనే విభజన చేయాలని, సీమాంధ్ర ప్రజల భయందోలనను పోగొట్టాలని ఆయన కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more