ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షడు, రవాణా శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ త్వరలో తన పదవులకు, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను అనుకూలంగా నోట్ ను మరో వారంలో రోజుల్లో కేబినెట్ ముందుకు తేవడానికి సన్నాహాలు చేస్తుండటంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులు అధిష్టాన వైఖరికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో బొత్స కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్లి వచ్చిన బొత్స అక్కడ అధిష్టాన పెద్దలతో పలుమార్లు భేటీ అయ్యాడు. ఇటీవలే రాష్ట్రానికి తిరిగి వచ్చిన బొత్స రాజ్ భవన్ కి వెళ్ళి అక్కడ గరవ్నర్ ని కలిసి రాష్ట్ర పరిస్థితులు, తమ రాజీనామా విషయం పై కూడా చర్చించినట్లు సమాచారం.
అధిష్టాన వైఖరిలో మార్పు రాకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా సమాచారం. గతంలో ‘రాష్ట్రం విడిపోతే తప్పేంటి ’ అని మాట్లాడిన బొత్సనే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్రుల గోడు వినిపించుకోకుండా నిర్ణయం తీసుకోవడం పట్ల అసంత్రుప్తితో ఉన్నారు. ఇక తన సొంత నియోజక వర్గంలో నిత్యం ఆయనకు సమైక్య సెగలు తగులుతుండటం, ఆయన ఇంటిని సమైక్య వాదులు చుట్టు ముట్టి రాజీనామా చేయమంటూ డిమాండ్ చేయడంతో బొత్స అటువైపు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం తన సొంత జిల్లా ప్రజలకు కూడా నచ్చజెప్పుకేనే పరిస్థితి లేకపోవడంతో రాజీనామా చేయడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
వచ్చేనెల 3వ తారీఖున కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే తెలంగాణ నోట్ ను కేబినెట్ లో ప్రవేశ పెట్టే అవకాశాలు ఉండటంతో ఆ లోపే రాజీనామా ఉంటుందని అంటున్నారు. ఇన్ని రోజుల నుండి ఉద్యమం నడుస్తున్నా తనపని తాను చేసుకుంటూ, రెండు పదవుల్ని అనుభవిస్తున్న బొత్స ఇప్పుడు వాటిని వదులుకోవడానికి ధైర్యం చేస్తాడా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more