Alternative to open heart surgery

Alternative to open heart surgery, Angio Vac device, Open heart surgery, Todd Dunlap, Dr Moriarty, UCLA Medical Center

Alternative to open heart surgery

వైద్య చికిత్సలో మరో మైలు రాయి దాటిన విజ్ఞానం

Posted: 09/27/2013 06:01 PM IST
Alternative to open heart surgery

రెండు అడుగుల మేర గడ్డకట్టిన రక్తం శరీరంలో ఎంతటి ఒత్తిడిని కలిగిస్తుందన్నది ఊహించుకోవచ్చు.  అది కూడా గుండెలోకి వెళ్ళి ఉన్నది ఓపెన్ హార్ట్ సర్జరీతో సరిచెయ్యవలసిందే.  కానీ అందుకు ప్రత్యామ్నాయంగా వైద్యులు వ్యాక్యూమింగ్ విధానంలో బయటకు లాగారు.  యుసిఎల్ఏ మెడికల్ సెంటర్ లో ఉపయోగించిన ఈ ఏంజియో వాక్ పరికరం ద్వారా 62 సంవత్సరాల టోడ్ డన్ లాప్ శరీరంలోని బ్లడ్ క్లాట్ ని వైద్యులు బయటకు తీసారు.  ఇది జరిగిన ఒక వారం లోపులోనే ఇంటికి తిరిగి వచ్చేసిన డన్ లాప్ ఇంట్లో తన 9 నెలల మనుమడితో ఆడుకోవటం విశేషం.

టాడ్ డన్ లాప్ మీద చేసిన సి టి స్కాన్ లో ఆయన శరీరంలో కాళ్ళ దగ్గర్నుంచి గుండె వరకు రక్తం గడ్డ కట్టి వుందని, అది ఆయన ప్రాణాలకు హాని కలిగించగలదని గుర్తించారు.  అది వీడిపోయి ఊపిరితిత్తులలో చిక్కుకునే ప్రమాదం ఉందని గ్రహించిన వైద్యులు ఇంత వరకు ఎక్కువగా ఉపయోగించని, ప్రాచుర్యంలో లేని ఏంజియో వాక్ పరికరం గురించి చెప్పగా డన్ లాప్ ఎంత మాత్రం సంశయించకుండా వెంటనే ఒప్పుకోవటం జరిగింది.  ఈ చికిత్స యుసిఎల్ఏ లో డాక్టర్ జాన్ మోరియార్టీ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ పద్ధతిలో గడ్డ కట్టిన రక్తాన్ని పరికరాల సాయంతో బయటకు లాగివేస్తూ దాన్ని వడపోయటం వలన ఆ తర్వాత రక్తం ఎక్కువగా ఎక్కించ వలసిన పని లేకపోయింది. 

దీనివలన మామూలుగా చేసే ఓపెన్ హార్ట్ శస్త్ర చికిత్స లో సగానికంటే తక్కువ శ్రమలోనే పని జరిగిపోయింది డాక్టర్లకూ రోగికి కూడా.  ఓపెన్ హార్ట్ లో గుండె ముందున్న ఎముకల గూడును ముందుగా సగాన్ని చీల్చి వాటిని రెండుపక్కలకూ వంచివేస్తేనే కానీ డాక్టర్లకు గుండెకు శస్త్ర చికిత్స చెయ్యటం కుదరదు.  గుండెలో చెయ్యవలసిన చికిత్స చేసిన తర్వాత మళ్ళీ ఎముకలను దగ్గరకు చేర్చి వైర్ తో కట్టి అవి అతికేటట్టుగా చేస్తారు.  దాని వలన రోగికి పూర్తిగా నయం కావటానికి సమయం పడుతుంది.  అలా కాకుండా తేలికగా జరిగిపోయినందుకు, చికిత్స విజయవంతమైనందుకు డాక్టర్ మోరియార్టీ సంతోషాన్ని వెలిబుచ్చారు.  ఇక ఈ విధానం ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉంది.  ఆశించని దానికంటే ఎక్కువ మంచి ఫలితాలు వచ్చాయని వైద్య బృందం తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more