జగన్ కు బెయిల్ వస్తుందా ? ఈరోజు ఏ తీర్పు రాబోతుంది ? ఆ పార్టీ నేతలే కాక అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ గట్టిగా వాదిస్తోంది. అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా జగన్ చంచల్ గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ పొందడానికి తాను అన్ని విధాల అర్హుడని ఈనెల 18వ తేదీన జగన్ బెయిల్ పిటిషన్ వేశారు. జగన్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సీబీఐ పేర్కొంటోంది. రాజకీయంగా పలుకుబడి ఉండడంతో విచారణ సమయంలో కేసు నీరుగారిపోతుందని సీబీఐ కోర్టులో ఆరోపించింది. ఈ దశలో జగన్‌కు బెయిల్ ఇవ్వడం మంచిది కాదని న్యాయస్థానానికి విన్నవించింది. సుప్రీంకోర్టు.. దర్యాఫ్తు పూర్తయ్యాక బెయిల్‌కు దాఖలు చేసుకోవచ్చని చెప్పింది కానీ బెయిల్ తీసుకోవడానికి అనుమతినివ్వలేదని సీబీఐ గుర్తు చేసింది. కేవలం 8నిమిషాల్లోనే సీబీఐ వాదనలు పూర్తి చేసింది. సీబీఐ వాదనలను ఖండిస్తూ.. జగన్ తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సుశీల్ కుమార్.. గట్టిగానే వాదించారు. సీబీఐ చెబుతున్న వాటిలో.. ఏ మాత్రం నిజాలు లేవనీ.. ఇంత పెద్ద వ్యవస్థను.. జగన్ లాంటి ఓ వ్యక్తి శాసిస్తాడనుకోవడం భ్రమే అవుతుందన్నారు. కోర్టు ఎన్ని షరతులు పెట్టినా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. దయచేసి జగన్‌కు బెయిలు మంజూరు చేయాలని కోర్టును వేడుకున్నారు. మూడే మూడు నిమిషాల్లో జగన్ తరఫు న్యాయవాదులు వాదనలు ముగించారు. జగన్ బెయిల్‌పై ఇరు వైపులా వాదనలు విన్న సీబీఐ కోర్టు.. తీర్పును ఈరోజు కు వాయిదా వేసింది. కోర్టులో సీబీఐ సాగించిన వాదనలపై పలు విమర్శలు వస్తున్నాయి. బలహీనమైన వాదనలు వినిపించిందనీ.. దీన్ని బట్టి చూస్తే.. జగన్‌కు బెయిల్ రావొచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more